ETV Bharat / city

SRSP PROJECT: నిండుకుండలా ఎస్సారెస్పీ.. జోరుగా సాగు పనులు..

తెలంగాణ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో సాగు పనులు ముమ్మరం చేశారు. ప్రాజెక్టు ఆయకట్టు అంతా సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఏడు లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరందనుంది. కొన్నేళ్ల కింద నీటి కోసం అల్లాడిన ఆయకట్టు రైతులకు అటు కాళేశ్వరం జలాలు, ఇటు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీళ్లు అండగా నిలవడంతో రైతులు మురిసిపోతున్నారు.

SRIRAM SAGAR PROJECT FULL OF WATER
SRIRAM SAGAR PROJECT FULL OF WATER
author img

By

Published : Jul 21, 2021, 4:23 PM IST

తెలంగాణ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద సాధారణంగా 14 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఎగువ మానేరు వరకు నాలుగున్నర లక్షలు, దిగువ మానేరు కింద మరో నాలుగున్నర లక్షల ఆయకట్టు ఉండేది. వీటికి కాకతీయ కాల్వ ద్వారా నీళ్లు అందించేవారు. లక్ష్మీ కాలువ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గానికి, సరస్వతీ కాలువ ద్వారా ప్రస్తుత నిర్మల్ జిల్లాకు నీళ్లు అందిస్తున్నారు. గతంలో ప్రాజెక్టు పూర్తిగా నిండక ఆయకట్టుకు నీళ్లందేవి కావు. ఎస్సారెస్పీ కింద నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరకు ఆయకట్టు ఉంది. అయితే కాళేశ్వరం నిర్మాణంతో ఎస్సారెస్పీ ఆయకట్టు స్వరూపం మారింది. కాళేశ్వరం నీటితో లోయర్, అప్పర్ మానేరు, మిడ్ మానేరును నింపుతున్నారు. దీంతో ఎస్సారెస్పీ నుంచి నీళ్లు రాకున్నా కాళేశ్వరం కింద ఎత్తిపోస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద దిగువ మానేరు వరకే సాగు నీరు అందిస్తే సరిపోతుంది. దిగువ మానేరు వరకు దాదాపు 4.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.

నిజాంసాగర్ ఆయకట్టుకు నీళ్లు...

ఇక తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో మాత్రం లక్ష్మీ కాలువతోపాటు, ఇతర ఎత్తిపోతల పథకాలు, శ్రీరాంసాగర్ కింద స్థిరీకరించిన నిజాంసాగర్ ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నారు. శ్రీరాంసాగర్ కింద నిజామాబాద్ జిల్లాలో కాకతీయ కాల్వ ద్వారా 9 వేలు, లక్ష్మీ కాలువ ద్వారా 25 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. ఇందుకు 4 టీఎంసీల నీళ్లు అవసరం అవుతాయి. చౌట్​పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కింద చెరువుల ద్వారా మరో 8 వేల ఎకరాలకు ఎస్సారెస్పీ కింద నీళ్లు అందిస్తున్నారు. దీనికి 0.80 టీఎంసీల నీళ్లు అవసరం కానున్నాయి. ఇవి కాకుండా నిజాంసాగర్ ఆయకట్టును దాదాపు లక్ష ఎకరాల వరకు ఎస్సారెస్పీ కింద స్థిరీకరించారు. నిజాంసాగర్ లో నీటి లభ్యత లేనందున నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీళ్లు ఇస్తున్నారు.

అలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద నిజాంసాగర్ డీ-50 నుంచి డీ-73 వరకు పంట కాల్వల ద్వారా 52 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నారు. ఇందుకు 4.60 టీఎంసీల నీళ్లు వినియోగించనున్నారు. అలాగే గుత్ప ఎత్తిపోతల పథకం కింద నిజాంసాగర్ డీ-74నుంచి డీ-82 వరకు 35 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నారు. ఇందుకు 2.75 టీఎంసీల నీళ్లు అవసరం కానున్నాయి. ఇవి కాకుండా నందిపేట్, బాల్కొండ మండలాల్లో తొమ్మిది చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలుండగా.. వీటికి కూడా ఎస్సారెస్పీ నీళ్లే అందనున్నాయి. వీటి కింద మరో 25 వేల ఎకరాల ఆయకట్టు సాగు అవుతోంది.

నాలుగేళ్లుగా నిండుకుండలా ఎస్సారెస్పీ...

గత మూడు నాలుగేళ్లుగా ఎస్సారెస్పీ వరుసగా నిండుతుండటం రైతులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది కూడా ఇప్పటికే నీటి నిల్వ 72 టీఎంసీలకు చేరడంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగిస్తున్నారు. వరి నాట్లు వేస్తున్నారు. గతంలో ప్రాజెక్టు లీకేజీ నీళ్ల కోసం కూడా రైతులు ఉద్యమాలు చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాళేశ్వరం వల్ల వరద కాలువలో నిత్యం నీళ్లు ఉంటున్నాయి. అలాగే భూగర్భ జలాలూ పెరిగాయి. ప్రస్తుతం కాలువల నీళ్లు అందించకుండానే వర్షాలకే ఆయకట్టు రైతులు పనులు చేసుకునే పరిస్థితి ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కాలువ ద్వారా పూర్వ వైభవం తెచ్చేందుకు చేపట్టిన పునరుజ్జీవనం ప్రాజెక్టు అవసరం ఇప్పటి వరకు రాలేదు. సాగుకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉండటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం కటకటలాడాల్సిన పరిస్థితి నుంచి నిత్యం నీళ్లు అందుబాటులో ఉండే స్థితికి ఎస్సారెస్పీ రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.