ETV Bharat / city

అన్నదాతల అప్పుల సాగు.. తీర్చేదారి లేక బలవన్మరణాలు !

వరస వైపరీత్యాలతో సాగు కలిసి రావడం లేదు. ఈసారైనా కలిసొస్తుందనే ఆశతో అప్పులపై అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడితే చివరకు చిల్లిగవ్వ దక్కడం లేదు. ఏ రైతును కదిలించినా లక్షలాది రూపాయల అప్పుల పాలయ్యామనే ఆవేదనే వినిపిస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోదారి కన్పించక కొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గతంలో దక్షిణ కోస్తా జిల్లాలకే పరిమితమైన రైతు ఆత్మహత్యలు కొన్నేళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల పరిధిలో 2019 జూన్‌ నుంచి 2022 మార్చి మధ్య ఆత్మహత్య చేసుకున్న వారిలో 852 మంది రైతుల కుటుంబాలను ‘ఈనాడు’ బృందం గత నెలలో స్వయంగా కలిసింది. ఎవరిని కదిలించినా సాగునే నమ్ముకుని చితికిపోయామని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ పరిహారం అందినవారిలో కొందరు తమకు ఇచ్చిన మొత్తంతో కొంతమేర అప్పులు తీర్చామని వివరించారు. కౌలు కార్డుల్లేవని, మద్యం తాగుతారని, వారి మరణానికి ఇళ్లలో గొడవలే కారణమంటూ సాయం తిరస్కరించారని మరికొందరు రైతు కుటుంబాలు వాపోతున్నాయి.

అన్నదాతల అప్పుల సాగు
అన్నదాతల అప్పుల సాగు
author img

By

Published : Jul 12, 2022, 4:13 AM IST

రాష్ట్రంలో 2019 జూన్‌ నుంచి 2022 మార్చి మధ్యలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే.. అధిక శాతం పత్తి, మిరప, వరి సాగయ్యే ప్రాంతాలేనని వెల్లడైంది. ఇవన్నీ పెట్టుబడులు ఎక్కువుండే పంటలే. కొన్నేళ్లుగా వరి సాగులో పెరుగుతున్న నష్టాలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. పరిశీలించిన కుటుంబాల్లో మాచర్ల నియోజకవర్గంలో 29మంది, గురజాల నియోజకవర్గంలో 27మంది, పెదకూరపాడు నియోజకవర్గంలో 20మంది, సత్తెనపల్లి నియోజకవర్గంలో 10మంది ఉన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న 38 కుటుంబాలను పరిశీలిస్తే.. సగం మందిని రైతులుగానే గుర్తించలేదు. శింగనమల, కల్యాణదుర్గం, తాడిపత్రి నియోజకవర్గాల్లో 30 కుటుంబాలకు సాయమందలేదు.

కర్నూలు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 215 మంది రైతుల కుటుంబాలను పరిశీలించగా.. 175 మందినే రైతులుగా గుర్తించారు. కొందరికి వైఎస్సార్‌ బీమా కింద పరిహారమిచ్చి సరిపెట్టారు. పత్తికొండలో 34 మంది, ఆళ్లగడ్డలో 30 మంది, డోన్‌లో 20 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో 54 మంది ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలను పరిశీలించగా.. సగానికిపైగా కుటుంబాలకు పరిహారం అందలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో పరిశీలిస్తే.. ఆత్మహత్య చేసుకున్న 56 మంది రైతు కుటుంబాలను పరిశీలించగా 12 మంది ప్రభుత్వ లెక్కలోకే రాలేదు. విశాఖపట్నం జిల్లాలోనూ 11మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. ఆరుగురిని రైతులుగా గుర్తించలేదు.

ఆర్థికసాయం అందినా.. ఇంకా అప్పుల్లోనే: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం ఇస్తోంది. సర్కారు లెక్కల ప్రకారమే 2019లో 370 మందికి, 2020లో 260 మందికి, 2021లో 126 మందికి సాయమందించారు. అయినా అధిక శాతం కుటుంబాల్ని అప్పులు వెంటాడుతూనే ఉన్నాయి. ఆర్థికసాయం అందించడంతోనే తమ బాధ్యత పూర్తయిందని అధికారులు భావించడమే దీనికి ప్రధాన కారణం.
గతంలో ప్రభుత్వమిచ్చే ఆర్థికసాయంలోనే కొంత మొత్తాన్ని అప్పులు తీర్చేందుకు కేటాయించి మిగిలిన మొత్తాన్ని రైతు కుటుంబాల అవసరాలకు, పెట్టుబడులకు వినియోగించేవారు. ఇప్పుడలా చేయడం లేదు. దీంతో అప్పులిచ్చినవారు ప్రభుత్వ సాయాన్ని జమ చేసుకుని మిగిలిన అప్పు తీర్చమని వెంటాడుతున్నారు. దీంతో ఏ అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారో అవే కుటుంబీకులను వెంటాడుతున్నాయి.

  • రైతు ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. కొన్ని చోట్ల అధికారులు కనీసం పరామర్శించడం లేదు. మరికొన్ని చోట్ల కార్యాలయాల్లో కూర్చుని పోస్టుమార్టం నివేదికల ఆధారంగా నివేదికలు రూపొందిస్తున్నారని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలూ రైతు ఆత్మహత్య కుటుంబాలను పరామర్శించడం లేదు.
  • 'ఈనాడు','ఈటీవీ భారత్' బృందం పరిశీలించిన 852 కుటుంబాల్లో 380 మందికి పరిహారం అందలేదు. వీరిలో 90% మందికి పోలీసు, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ నివేదికలే ఇవ్వలేదు. కొందరికి వైఎస్సార్‌ బీమా కింద రూ.లక్ష పరిహారంతో సరిపెట్టారు. మిగిలిన రైతు కుటుంబాలను విస్మరించారు.

నాన్న లేక.. చదువుకోలేక: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్‌ మండలం పలుదొడ్డి గ్రామానికి చెందిన బి.లక్ష్మన్న (40) నాలుగెకరాల్లో వరి, ఉల్లి, మిరప వేశారు. రూ.2.40 లక్షల పెట్టుబడి పెట్టారు. తెగులు సోకి వరి పోయింది. వర్షాభావంతో ఉల్లి, మిరప దెబ్బతిన్నాయి. పంటల బీమా అందలేదు. పాత అప్పులు, వడ్డీకి కొత్త అప్పు కలిసి రూ.9.50 లక్షలకు చేరింది. రుణదాతల ఒత్తిడి భరించలేక లక్ష్మన్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లక్ష్మన్న మరణించాక పొలం చేసేవాళ్లు లేక ఉన్న నాలుగెకరాలను ఆయన భార్య పద్మ కౌలుకిచ్చి కూలీకి వెళుతున్నారు. ముగ్గురు బిడ్డల్లో కుమార్తె దుర్గను ఆరో తరగతి మాన్పించి కూలికే తీసుకెళ్తోంది. కుమారులు ప్రసాద్‌ (3వ తరగతి), మరో చిన్నారి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నారు. లక్ష్మన్న బ్యాంకులో పాసుపుస్తకాలు పెట్టి రూ.2.30 లక్షల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు తన ఖాతాలో వైఎస్సార్‌ బీమా కింద వచ్చిన రూ.లక్ష, డ్వాక్రా సొమ్ము రూ.30 వేలు, అమ్మఒడి నగదును తీసుకోనీయకుండా బ్లాక్‌ చేశారని పద్మ కన్నీటిపర్యంతమయ్యారు. ‘ఒత్తిడి తట్టుకోలేక పొలం అమ్మి అప్పు తీరుద్దామనుకున్నా. పాసు పుస్తకాలు బ్యాంకులో ఉన్నాయి. అప్పు చెల్లిస్తేనే ఇస్తామంటున్నారు’ అని రోదించారు.

పొలం వేలం వేస్తామంటున్నారు: విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం గెడ్డపాలెం రైతు పినపాత్రుని లోవరాజు(40) తన 1.85 ఎకరాల్లో వరి వేశారు. పంట దెబ్బతినడంతో నష్టం వచ్చింది. గతంలో చేసిన అప్పులకుతోడు కొత్త అప్పులు కలిసి తడిసి మోపెడయ్యాయి. తీర్చలేని పరిస్థితిలో గతేడాది జనవరి 23న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ‘పంట పెట్టుబడి కోసం బ్యాంకులో భూమి తాకట్టు పెట్టి రుణం తెచ్చారు. పంటనష్టంతో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటినుంచి బ్యాంకులు, రుణదాతలు ఒత్తిడి తెస్తున్నారు. తాకట్టు పెట్టిన భూమిని వేలం వేస్తామంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తే అప్పులు తీర్చాలని చూస్తున్నాం’ అని లోవరాజు భార్య వరలక్ష్మి వాపోయారు.

పొలం సాగు చేశారు.. అయినా రైతు కాదు: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడుకు చెందిన లక్కిరెడ్డి రమణారెడ్డి 2.75 ఎకరాలకు తోడు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని మిరప, పొగాకు, కంది వేశారు. పంట పండినా ధర లేక అప్పులే మిగిలాయి. అసలుకు వడ్డీ రూ.6 లక్షలకుపైగా చేరింది. అలాగే ఉంటే అప్పు తీర్చలేనని భావించి భార్యాబిడ్డలతో హైదరాబాద్‌కు వలసవెళ్లారు. తాపీ పని చేపట్టారు. ఈ క్రమంలోనే ఇంటికొచ్చిన ఆయన్ను రుణమిచ్చినవారు నిలదీయడంతో మనస్తాపానికి గురై గతేడాది ఫిబ్రవరి 27న ఇంట్లో ఉరేసుకున్నారు. తాపీ మేస్త్రీ అంటూ పరిహారం ఇవ్వలేదు. మద్యం అలవాటుందని తేల్చారు. దీంతో ఆయన తండ్రి వెంకటేశ్వరరెడ్డి.. బ్యాంకు రుణం తీసుకుని రూ.6 లక్షల అప్పు తీర్చారు. కోడలు ప్రభావతి, మనవరాలి బాధ్యతలూ ఆయనపైనే పడ్డాయి. శీతల గోదామువద్ద కాపలాదారుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రభావతి కూలికి వెళ్తూ అండగా నిలుస్తోంది.

భూమి అమ్మినా తీరలేదు..: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం జామికి చెందిన ఎర్నినాయుడు(29) తనకున్న ఎకరానికి తోడు అరెకరం కౌలుకు తీసుకుని మిరప, దొండ, వంగ వేశారు. మూడేళ్లు వరసగా నష్టపోయారు. ఏటికేడాది చేసిన అప్పులు పెరిగి రూ.12 లక్షలకు చేరాయి. అరెకరం అమ్మినా తీరలేదు. ఇంతలో తల్లికి అనారోగ్యం, పొలానికి పెట్టుబడులకు తోడు అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. తట్టుకోలేని ఎర్నినాయుడు గతేడాది జనవరి 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వంనుంచి అందిన రూ.7లక్షలతో కొంతమేర అప్పులు తీర్చారు. రూ.5లక్షల అప్పు మిగిలే ఉంది. అప్పులవాళ్లకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆయన భార్య రమణ వాపోయారు. ఇద్దరు కుమార్తెల చదువుతోపాటు అత్త, మాటలు రాని మరిదితో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆమె.. ఉన్న అరెకరంలోనే సాగు చేస్తూ కూలికి వెళ్తున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.