ETV Bharat / city

ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్​.. కట్​ చేస్తే జైల్లో ఊచలు లెక్కపెడుతూ.. - fake doctor entered icu in panjagutta hospital

Fake Doctor Arrested: తెల్ల కోటు, బూట్లు వేసుకున్నంత మాత్రాన డాక్టర్​ అయిపోడు.. వారిలో ఖతర్నాక్​లు కూడా ఉంటారు. పొరపాటున వాళ్లను డాక్టర్లుగా నమ్మి.. అడిగినంతా ఇచ్చేశామో.. ఇక అంతే సంగతులు. సరిగ్గా ఇలాగే ఇక్కడ ఓ వ్యక్తి కూడా డాక్టర్​ అవతారం ఎత్తాడు. బురిడీ కొట్టించి రోగుల నుంచి డబ్బులు దోచుకుందామనుకుని ప్రయత్నించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. అసలేం జరిగిందంటే..

ICU DOCTOR
ICU DOCTOR
author img

By

Published : May 21, 2022, 3:44 PM IST

Fake Doctor Arrested: వైద్యుడి గెటప్​లో నేరుగా ఆస్పత్రి ఐసీయూలోకి ప్రవేశించి.. రోగి బంధువుల నుంచి డబ్బులు లాగుదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు ఓ యువకుడు. తెలంగాణ రాజధాని హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఈ నెల 16న బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్చించారు. రోగికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అదే రోజు గుర్తుతెలియని వ్యక్తి వైద్యుడి వేషధారణతో ఐసీయూలోకి వెళ్లాడు. రోగి కేసు షీట్‌ను పరిశీలించి రోగి సహాయకుడి ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. వాళ్లకు ఫోన్‌ చేసి అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, తక్షణం రూ.50 వేలు పంపించాలని చెప్పాడు.

విస్తుపోయిన బంధువులు తమకు ఈఎస్‌ఐ వర్తిస్తుందని, డబ్బులెందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. ఈఎస్​ఐ కార్డు ద్వారా వచ్చిన వారికి రూ. 12,500 రాయితీ ఇస్తున్నామని.. మిగతా డబ్బు చెల్లించాలని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన రోగి బంధువులు.. ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వారు ఆరా తీయగా సదరు వ్యక్తి నకిలీ డాక్టర్​ అని తేలింది. ఆస్పత్రి సెక్యూరిటీ అధికారి సాగర్​ చారి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జకీరుద్దీన్‌(19)గా గుర్తించారు. అరెస్ట్​ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.