ETV Bharat / city

'వృత్తిజీవితం చివరిదశలో కొత్త విషయం అనుభవంలోకి వచ్చింది' - justice rakesh kumar

వివిధ వ్యాజ్యాల్లో తనను విచారణ నుంచి తప్పుకోవాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ పిటిషన్లు దాఖలు చేయడంపై.... జస్టిస్ రాకేశ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి జీవిత చివరి దశలో కొత్త విషయం తనకు అనుభవంలోకి వచ్చిందన్నారు. విచారణ నుంచి తప్పుకోవాలని కోరే ధోరణి ప్రారంభమైందన్నారు. న్యాయమూర్తులపై ఎల్లప్పుడూ అనుమానం వ్యక్తం చేస్తుంటే విధులు నిర్వర్తించడం కష్టమని పేర్కొన్నారు.

Experiencing something new at the end of my career says justice rakesh kumar
'వృత్తిజీవితం చివరిదశలో కొత్త విషయం అనుభవంలోకి వచ్చింది'
author img

By

Published : Dec 18, 2020, 4:36 AM IST

'వృత్తిజీవితం చివరిదశలో కొత్త విషయం అనుభవంలోకి వచ్చింది'

గురువారం రాష్ట్ర హైకోర్టులో వివిధ వ్యాజ్యాల విచారణ సందర్భంగా.... జస్టిస్ రాకేశ్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అన్న అంశం విచారణ నుంచి జస్టిస్ రాకేశ్‌కుమార్ తప్పుకోవాలంటూ ప్రభుత్వం అనుబంధ వ్యాజ్యం దాఖలు చేసిందని..... న్యాయవాది సుమన్‌ ధర్మాసనానికి విన్నవించారు. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తారన్నారు. రాజ్యాంగ విచ్ఛిన్నంపై ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏను కొట్టివేస్తూ... ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులు తమకింకా అందలేదన్నారు. తక్షణమే వాటిని అందించాలని రిజిస్ట్రీని ఆదేశించినట్టు ధర్మాసనం గుర్తుచేసింది.

జోక్యం చేసుకున్న న్యాయవాది మోహన్‌రెడ్డి.... దస్త్రాలు రిజిస్ట్రీకి పంపకుండా ఛాంబర్‌లో ఉంచినంత కాలం వాటిని పొందలేమన్నారు. సివిల్ దావాల్లో అప్పీల్‌కు వెళ్లకుండా చేయాలనుకున్నప్పుడు కొంతమంది న్యాయాధికారులు.... దస్త్రాలను ఛాంబర్‌లో ఉంచుతారన్న వాదనలపై కోర్టు అభ్యంతరం తెలిపింది. అప్పీల్‌కు వెళ్లడం మీ హక్కు అని గుర్తు చేస్తూ అప్పటికప్పుడు రిజిస్ట్రీని పిలిచి... ఉత్తర్వుల ప్రతిని ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేస్తుండగా పోలీసులు తరఫు న్యాయవాది ఎస్​ఎస్​ప్రసాద్ పలుమార్లు జోక్యం చేసుకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్ రాకేశ్‌కుమార్... విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ వేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతామని పేర్కొంటూ శుక్రవారానికి వాయిదా వేసింది.

వివిధ హెబియస్ కార్పస్ వ్యాజ్యాల విచారణలో భాగంగా... రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏ తమ ముందుకు రానప్పుడు ఎలా విచారిస్తామని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించిన న్యాయవాది మోహన్‌రెడ్డి విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని తేలిగ్గా తోసిపుచ్చడానికి వీల్లేదన్నారు. వాదనలు వినిపించిన మరో న్యాయవాది నిరంజన్‌రెడ్డి విచారణ నుంచి తప్పుకోవాలని గౌరవప్రదంగా విజ్ఞప్తి చేశామని.. రాజ్యాంగ విచ్ఛిన్నం విషయం వ్యవస్థకు సంబంధించినదని.. న్యాయమూర్తులు వస్తుంటారు, పోతుంటారన్నారు.

పాత గుంటూరు ఠాణాపై దాడి ఘటనకు సంబంధించి.... నమోదు చేసిన కేసుల ఉపసంహరణను సవాల్ చేస్తూ.. దాఖలైన వ్యాజ్యం విచారణలో తనను తప్పుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తుందేమోనని.. జస్టిస్ రాకేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. అందుకే విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తున్నామన్నారు. వృత్తిజీవితం చివరిదశలో ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన చెందారు.

ఇదీ చదవండీ... పుంజుకుంటున్న గ్రానైట్‌ క్వారీలు... వీరికి పని లేదు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.