విలీనంతో ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఉన్న పాత పింఛన్ విధానం తమకూ వర్తిస్తుందని ఎదురుచూస్తున్న ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) సిబ్బంది ఆశలు నెరవేరే అవకాశం కనిపించడంలేదు. వీరికి కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్) అమలుకు కసరత్తు ఆరంభించారు. ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్-95 పింఛను పథకానికి బదులు సీపీఎస్‌లో చేరే అవకాశం కల్పించనున్నారు.
ఇందుకు ఏయే విధివిధానాలు పాటించాలో తెలపాలంటూ ఆర్టీసీ యాజమాన్యం ఓ దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపింది. దీనిని ఆర్థికశాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చిన తర్వాత.. ఈపీఎఫ్-95లో కాకుండా సీపీఎస్‌లో చేరాలనుకునే ఉద్యోగులకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో దీనిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి: Remand: తెదేపా నేత పట్టాభికి నవంబరు 2 వరకు రిమాండ్