తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీపైకి కాండం తొలుచు పురుగులాంటి సీఎంని వదిలారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాజీమంత్రి జవహర్ విమర్శించారు. ఆ దెబ్బకి తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే, ఏపీలో రెండెకరాలు కొనే స్థాయికి వ్యవస్థలన్నింటికీ విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో ఒక ప్రెసిడెంట్ మెడల్ అమ్మితే వచ్చే సొమ్ముతో తెలంగాణలో మూడు మేన్షన్ హౌస్‌లు కొనేలా దోచుకోవటం మరో విశేషమని ట్విట్టర్లో ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండీ... ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు బ్రేక్.. కారణం ఇదేనా..!