ఆర్టీసీకి చెందిన 1,300 ఎకరాలను ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. గతంలో తమను తప్పుపట్టి వాళ్లు 50 ఏళ్లు లీజుకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ, కర్నూలు, తిరుపతిలో రూ.1,500 కోట్ల విలువైన స్థలాలు ఇస్తున్నారన్న అయ్యన్న... 50 ఏళ్లపాటు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ఆర్టీసీకి తిరిగి వస్తాయా..? అని ప్రశ్నించారు. సీఎం నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు వ్యతిరేకించాలని అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో ఏం జరిగినా తెదేపా నాయకులకే ముడిపెడతారా?: చంద్రబాబు