అమరావతి అజెండాతో ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... ఇందుకు వైకాపా సిద్ధమా..? అని మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి సవాల్ విసిరారు. తెదేపా అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌పై సీఎం మాట్లాడకుండా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుంటేనే వారి చిత్తశుద్ధి తేటతెల్లమైందని విమర్శించారు. ప్రజలు సరైన సమయంలో వైకాపాకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ప్రజల అభీష్టం మేరకే ప్రభుత్వాలు పని చేయాలని.. ఎన్నికలకు ముందే మూడు రాజధానులని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిందని అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు.. తీసుకునే నిర్ణయాలపై కనీసం ప్రజాభిప్రాయం కోరకపోవడం దారుణమని అన్నారు. మూర్ఖంగా ముందుకెళ్తే భవిష్యత్తులో చరిత్రహీనులుగా నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి..