ETV Bharat / city

కొవిడ్‌తో అనాథలైన చిన్నారులకు అండగా..! - అనాథ చిన్నారులకు ఏపీ ప్రభుత్వ సాయం

కొవిడ్‌ బారిన పడి తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన చిన్నారులు 137 మందిని గుర్తించామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా వివరించారు. ఈ ఏడాది మార్చి నెలలో 9 మంది, ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 128 మంది పిల్లలు కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. వారి పేరిట రూ.10 లక్షల చొప్పున బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, సంబంధిత బాండ్లను అందించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు చేపట్టారని వెల్లడించారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీ మొత్తాన్ని నెలకు లేదా మూడు నెలలకోసారి బాధిత చిన్నారుల బ్యాంకు ఖాతాలకు జమయ్యేలా ఏర్పాట్లు చేశామని, ఆ మొత్తాన్ని వారి పోషణ ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చని వివరించారు. వారికి 25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లాతో ఈటీవీ భారత్ ముఖాముఖిలో.. చాలా విషయాలపై ఇలా స్పందించారు.

ap government help to orphan children
ap government help to orphan children
author img

By

Published : Jun 3, 2021, 7:42 AM IST

కొవిడ్‌తో తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల్ని సంరక్షించే వారెవరూ లేకపోతే వారికి ఆశ్రయమిచ్చేందుకు ప్రతి జిల్లాలోనూ రెండు చొప్పున బాలల సంరక్షణ గృహాల్ని ఏర్పాటు చేశాం. బాలబాలికలకు వేర్వేరుగా సంరక్షణ గృహాలున్నాయి. ఆయా జిల్లాల్లోని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు కొవిడ్‌ బారిన పడి చనిపోయినా అలాంటి పిల్లలూ ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. వారికి 18 ఏళ్లు వచ్చే వరకూ ఉచిత విద్య, వసతి అందిస్తాం. తల్లిదండ్రులు కొవిడ్‌తో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, పిల్లల్ని సంరక్షించే వారు లేకపోతే అలాంటి చిన్నారులకు తాత్కాలికంగా వీటిలో వసతి కల్పిస్తాం. - కృతికా శుక్లా, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌

విషాదం నుంచి తేరుకునేందుకు కౌన్సెలింగ్‌

అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల్ని కోల్పోతే పిల్లల మానసిక స్థితిపై చాలా ప్రభావం పడుతుంది. వారు ఆ విషాదం నుంచే తేరుకునేలా మానసిక స్థైర్యం కల్పించేందుకు ప్రతి జిల్లాకూ ఒక సోషల్‌ కౌన్సెలర్‌, సైకాలజిస్ట్‌ను నియమించాం. వీరు సంరక్షకుల వద్ద ఉంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చి, సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలతో ఎలా వ్యవహరించాలో సంరక్షకులకూ అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం నుంచి సాయం పొందే విధానాల్ని వివరిస్తారు. - కృతికా శుక్లా, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌

1098, 181 నంబర్లకు కాల్‌ చేయండి

పిల్లలకు సంబంధించి ఎలాంటి అవసరానికైనా 1098, 181 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేయొచ్చు. పథకాలకు సంబంధించి ఎలాంటి సమాచారమైనా వారు అందిస్తారు. చైల్డ్‌లైన్‌తో కలిసి కొన్ని వాహనాలను ఏర్పాటు చేశాం. పై నంబర్లకు కాల్‌ చేస్తే వారే వచ్చి వాహనాల్లో తీసుకెళ్లి బాలల సంరక్షణ గృహాల్లో చేర్పిస్తారు. కొవిడ్‌ బారిన పడి తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా పథకం ప్రకటించింది. ఆ మార్గదర్శకాలు రాగానే వాటి ద్వారా కూడా లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటాం. - కృతికా శుక్లా, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌

ప్రతి నెలా రూ.500 సాయం

కుటుంబాన్ని పోషించే ఇంటిపెద్దను కోల్పోతే ఆ ప్రభావం పిల్లలపై పడుతోంది. అలాంటి చిన్నారులకు సమీకృత బాలల సంరక్షణ కార్యక్రమం కింద నెలకు రూ.500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 1,912 మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నాం. దీని ద్వారా ప్రయోజనం పొందాలంటే జిల్లా స్థాయిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను సంప్రదించొచ్చు. - కృతికా శుక్లా, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌

ఇదీ చదవండి:

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.