ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

9am top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 25, 2020, 9:01 AM IST

  • ప్రవీణ్ ప్రకాశ్ కార్యాలయంపై నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మధ్య వివాదం చెలరేగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 26న సమావేశానికి హాజరుకావాలని ప్రవీణ్ ప్రకాశ్ వ్యక్తిగత కార్యదర్శి నుంచి రమేశ్​ కుమార్​కు వర్తమానం వెళ్లడం వివాదానికి కారణమైంది. దీనిపై ఎస్​ఈసీ తీవ్రంగా స్పందించారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రైతు దైన్యం

మరో పక్షం రోజులు ఆగితే బస్తాలకొద్దీ వడ్లు ఇంటికొస్తాయన్న అన్నదాతల ఆశలపై వాయుగుండం వరదనీరు చల్లింది. గింజ దశలో ఉన్న వరిని ముంచెత్తింది. రోజుల తరబడి పంట నీటిలోనే నానింది. ఉద్యానపంటలూ తుడిచిపెట్టుకుపోయాయి. ఎకరానికి వేలల్లో పెట్టుబడి పెట్టినా వడ్లగింజ కాదు కదా... పశువుల మేతకు ఎండుగడ్డి అయినా మిగల్లేదని ఉభయ గోదావరి జిల్లాల రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పరువూ దక్కలేదు.. పైసలూ పోయె!

2018లో ఏవీ రమణదీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై తితిదే అధికారులు రూ.200 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇందుకోసం కోర్టులో రూ.2 కోట్లు ధరావతు కూడా చెల్లించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. కొత్త ఛైర్మన్ వద్ద పరువునష్టం దావా విషయం ప్రస్తావనకు రాగా... తాము దాన్ని ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. తితిదే చెల్లించిన రూ.2 కోట్లనూ వదులుకుంటామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టెక్కలిలో మాయ లేడి... ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ!

నిరుద్యోగుల ఆశలే ఆమె పెట్టుబడి. తన చేతిలో అధికారులు, నాయకులు ఉన్నారంటూ మాటల గారడీతో ఎదుటివారిని బుట్టలో వేసుకుని కుచ్చుటోపీ పెట్టడం ఆమెకున్న నైపుణ్యం. ఈక్రమంలో ఒకరు కాదు..ఇద్దరు కాదు..తీగ లాగుతూ వెళితే మోసపోయిన వారి సంఖ్య ఎక్కువే కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్న ఈ తంతు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టండి'

భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టాలని అన్నిరాష్ట్రాలను కేంద్ర భూగర్భ జలమండలి కోరింది. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆల్ఫాబెట్స్‌ రానివాళ్లు ఉద్యోగాలిస్తారట: నితీశ్‌

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. పెద్దగా వివాదాల జోలికి పోని జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌ కుమార్‌ సైతం విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆర్జేడీ నేత తేజస్వీపై విమర్శల దాడి పెంచారు. అదే సమయంలో తనపై నిత్యం విమర్శలు చేసే చిరాగ్ పాసవాన్​ను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆన్‌లైన్‌.. ఆఫ్‌లైన్‌.. ఏదైనా సెల్‌ఫోనే

కొవిడ్​-19 సంక్షోభంతో దసరా-దీపావళి పండగ అమ్మకాలు ఎలా ఉంటాయనే అనిశ్చితి వ్యాపారుల్లో నెలకొంది. అయితే ఇ-కామర్స్​ పోర్టళ్లు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​లకు తోడు రిటైల్​ విక్రయశాలలూ భారీగా ఆఫర్లు, బహుమతులు ఇస్తూ కొనుగోలుదార్లను భారీగానే ఆకర్షిస్తున్నాయి. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​.. ఏదైనా సెల్‌ఫోన్‌ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి. టాబ్లెట్‌ పీసీలు, ల్యాప్‌టాప్‌లకూ గిరాకీ పెరిగింది. ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు గతేడాది స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐరోపా దేశాల్లో కరోనా కల్లోలం- పెరుగుతున్న కేసులు

కరోనా మహావిలయంలో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి. రోజుకు లక్షల మందికి సోకుతూ.. వేగంగా వ్యాపిస్తోంది. శనివారం కొత్తగా 4.52 లక్షల కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4.29కోట్లు దాటింది. 11.54 లక్షలకుపైగా మరణించారు. అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో 83 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కొలంబియాలో కేసుల సంఖ్య 10 లక్షల మార్క్​ను అధిగమించింది. ఫ్రాన్స్​లోనూ వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆసియా​ చెస్​ టోర్నమెంట్​ ఫైనల్లో భారత జట్లు

ఆన్​లైన్​ వేదికగా జరిగిన ఆసియా చెస్​ టోర్నమెంట్లో భారత​ ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. పురుషులు, మహిళల జట్లు ఫైనల్​కు చేరాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలుగు వంటకాలపై ప్రేమలో పడ్డ 'ఇస్మార్ట్' నటి

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు నినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది నభా నటేష్. తర్వాత పూరి దర్శకత్వంలో 'ఇస్మార్ట్' యాక్టింగ్ చేసి ప్రేక్షకులను అలరించింది ఈ కన్నడ భామ. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీ అవుతోన్న నభా నటేష్ 'ఈనాడు-ఈటీవీ భారత్'​ సినిమాతో దసరా కబుర్లు పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.