- 'సింహాల ప్రతిమలు కనిపించటం లేదు.. దర్యాప్తు చేయండి'
కనకదుర్గమ్మ వెండి రథంపై ఉండే సింహాల్లో మూడు అదృశ్యమైన ఘటనలో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కోరారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిశ్రమలకు విద్యుత్ రాయితీ.. ప్రకటనలకే పరిమితం!
పరిశ్రమలకు ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్తు రాయితీ అందటంలేదు. దరఖాస్తు చేసుకోవటంపై అవగాహన లేక, సాంకేతికత తెలియని వారు అనేకమంది ఉన్నారు. మరోపక్క కొంతమంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా... ప్రకటన చేసి నెలలు గడిచినా ఇంతవరకూ అమలుకు నోచుకోవటం లేదు. లాక్ డౌన్ కష్టాల నుంచి పరిశ్రమలు పున:ప్రారంభించేందుకు ప్రభుత్వం చేసిన ప్రకటన ఎంతో తోడ్పాటునిస్తుందని ఆశించినవారికి భంగపాటే ఎదురవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ప్రపంచ స్థాయి క్లౌడ్ కంప్యూటింగ్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుదాం'
ప్రపంచ స్థాయి క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'కరోనా కారణంగా కష్టపడ్డాం.. త్వరలోనే బయటపడతాం'
కరోనా మహమ్మారి.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంపై కోవిడ్ ప్రభావం అంతా ఇంతా కాదు. భారత నౌకా వాణిజ్య ఎగుమతులు, దిగుమతులపైనా తీవ్రంగానే ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. గత 6 నెలలుగా విశాఖ పోర్టు ఎదుర్కొంటున్న ఆటుపోట్లపై... పోర్ట్ ఛైర్మన్ కే. రామ్మోహన్ రావు ఏం చెప్పారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- 'ముందు నియంత్రించాల్సింది డిజిటల్ మీడియానే'
మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది కేంద్రం. ఒకవేళ మీడియాను నియంత్రించాలనుకుంటే.. తొలుత డిజిటల్ మీడియాపై చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కోసం ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జంగిల్ సఫారీ.. తప్పక వెళ్లాలోసారి...
ఆ అడవిని మనుషులే నిర్మించారు. దాని విస్తీర్ణం 800 వందల ఎకరాలు. ఈ అడవిలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు సందడి చేస్తుంటాయి. అందులో ఓ జలాశయం కూడా ఉంది. ఇంతకూ ఆ అడవి ఎక్కడుంది? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- ఏటీఎం కార్డ్ లేకుండా వాచ్‌తో చెల్లింపులు
దిగ్గజ వాచ్ తయారీ సంస్థ టైటాన్ సరికొత్త వాచ్‌లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఏటీఎం కార్డ్ అవసరం లేకుండా నగదు చెల్లింపులు చేయడం వీటి ప్రత్యేకత. ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొద్ది గంటల్లోనే వ్యూహం మార్చిన చైనా- ఎందుకు?
వాస్తవాధీన రేఖ వెంబడి గతవారం కాల్పులు జరిగిన తర్వాత చైనా సైన్యం తన దూకుడును మరింత పెంచినట్లు ఓ పత్రిక వెల్లడించింది. యుద్ధ సన్నద్ధత కోసం రెండో అత్యున్నత దశను అమలు చేసిందని తెలిపింది. మరిన్ని ఆయుధాలతో పాటు సైన్యాన్ని సరిహద్దుకు తరలించినట్లు పేర్కొంది. అయితే.. భారత్, చైనా విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం డ్రాగన్ వెనక్కి తగ్గినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోహిత్ రాణిస్తే ముంబయిదే టైటిల్: బ్రెట్‌లీ
ఐపీఎల్లో రోహిత్ శర్మ రాణిస్తే ముంబయి ఇండియన్స్ మరో టైటిల్ గెలుచుకోవడం ఖాయమని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ. ఈసారి జట్టు సమతూకంతో ఉందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఊర్మిళను పోర్న్ స్టార్ అంటూ కంగన వ్యాఖ్య
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. సీనియర్ నటి ఊర్మిళను 'సాఫ్ట్ పోర్న్ స్టార్' అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఈ విషయంలో బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులు ఊర్మిళకు మద్దతుగా నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.