- దేశంలో 2 లక్షల 73 వేల కేసులు- 1,619 మరణాలు
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా రెండు లక్షల 73 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఏకంగా 1,619 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అడ్డసరం మొక్కలో.. కరోనా ప్రభావం తగ్గించే జన్యువులు!
దగ్గు, ఉబ్బసం, రక్తస్రావం నివారణ, చర్మవ్యాధుల చికిత్సలో వినియోగించే అడ్డసరం ఔషధ మొక్కపై.. కొవిడ్‌కు మందుల కోసం పరిశోధనలు చేస్తున్న వారి దృష్టి పడింది. కరోనాపై ఇది ఏ మేరకు పనిచేస్తుందనే విషయంపై పలు సంస్థలు పరిశోధనలు చేశాయి. ఇంతకీ అందులో తేలింది ఏంటంటే? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.
- కరోనాతో మృతి.. బంగారు గాజులు మాయం!
కరోనా సోకిన ఓ మహిళ.. ఆసుత్రిలో చేరింది. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి కన్నుమూసింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆ సమయంలో.. ఆమె చేతికి బంగారు గాజులు మాయమయ్యాయని కుటుంబీకులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశాఖ ఉక్కు కోసం.. కదలిన దిల్లీ రైతు ఉద్యమ నాయకులు
గుడుల పరిరక్షణకు పాటుపడే మోదీ సర్కారుకు... ఆధునిక దేవాలయమైన విశాఖ ఉక్కును పరిరక్షించాల్సిన బాధ్యత లేదా అని కార్మిక నేతలు ప్రశ్నించారు. కొవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ ఉత్పత్తితో ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఘనత విశాఖ ఉక్కుదేనన్నారు. అలాంటి సంస్థను ప్రైవేటుపరం ఎలా చేస్తారని నిలదీశారు. దిల్లీ రైతు ఉద్యమ నాయకులతో కలిసి సమర శంఖారావం పూరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భద్రాద్రి రామయ్య సన్నిధికి చేరిన కోటి తలంబ్రాలు
వేయి పున్నముల శోభను కళ్లెదుట సాక్షాత్కరింపచేసే భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీరామనవమిని పురస్కరించుకుని.. తెలంగాణలోని భద్రాద్రిలో జరిగే స్వామివారి కల్యాణ క్రతువు తలంబ్రాలు ఇప్పటికే భద్రాద్రికి చేరుకున్నాయి. జగత్ కళ్యాణంగా అభివర్ణించే ఈ మహత్తర కార్యక్రమంలో గోటితో వలిసిన తలంబ్రాలకు ప్రత్యేక విశిష్టత ఉంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం స్వామివారికి సమర్పించే తలంబ్రాలను ప్రత్యేకంగా తయారుచేసి అందజేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్లో భాజపా కార్యాలయంపై బాంబు దాడి
బంగాల్లో భాజపా కార్యాలయంపై బాంబు దాడి కలకలం సృష్టిస్తోంది. ఈ దాడులపై భాజపా, టీఎంసీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసుల ఎదుటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లాహోర్‌లో కిడ్నాపైన 11 మంది పోలీసులు విడుదల
పాక్‌లోని లాహోర్‌లో అపహరణకు గురైన 11 మంది పోలీసులను నిషేధిత టీఎల్పీ పార్టీ కార్యకర్తలు విడిచిపెట్టారు. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు ఆ దేశ మంత్రి షేక్ రషీద్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీ నష్టాల్లో మార్కెట్లు- 47,800 దిగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,120 పాయింట్లకుపైగా కోల్పోయి 47,717 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 310 పాయింట్లకుపైగా నష్టంతో 14,301 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగుతా: ఫెదరర్
వచ్చే నెల పారిస్ వేదికగా జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడనున్నట్లు స్పష్టత ఇచ్చాడు దిగ్గజ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్. మోకాలి శస్త్రచికిత్సల అనంతరం ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న అతడు ఇటీవల ఖతార్ ఓపెన్‌లో ఆడాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆచార్య', 'థాంక్యూ' సినిమాలపై కరోనా ఎఫెక్ట్!
కొవిడ్ ప్రభావంతో 'ఆచార్య' షూటింగ్ ఆపేయగా, 'థాంక్యూ' విదేశీ షెడ్యూల్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పవన్, సోనూసూద్ తదితరులు స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.