ETV Bharat / city

ప్రధాన వార్తలు @11 AM - ఏపీ న్యూస్

.

11am top news
ప్రధాన వార్తలు @11 AM
author img

By

Published : Oct 24, 2020, 11:00 AM IST

  • గుట్టుచప్పుడు కాకుండా వచ్చి కూల్చడం అన్యాయం: వర్సిటీ సిబ్బంది
  • ముందస్తు సమాచారం లేకుండా గీతం వర్సిటీ కట్టడాలు కూల్చివేయటం అన్యాయమని వర్సిటీ సిబ్బంది తెలిపారు. 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని ఆర్డీవో పెంచల కిషోర్ స్పష్టం చేశారు. దీనిపై యాజమాన్యానికి పూర్తి సమాచారం తెలుసని ఆయన వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తిరుమలలో శ్రీవారికి వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి చక్రస్నానంలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన దురాగతం...పసితనంలోనే పసుపుతాడు

పసితనం పసుపుతాడుకు బందీగా మారుతోంది. తల్లిదండ్రుల మాటున పెరగాల్సిన బాల్యం... బరువు బాంధవ్యాల నడుమ చిక్కుకుపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడాదిన్నర కాలంలో 213 బాల్య వివాహ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశంలో 78లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 53వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 78లక్షలు దాటాయి. మరో 650మంది మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్​లో ఐరాస పోస్టల్ స్టాంప్​ విడుదల

ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా భారత విదేశాంగమంత్రి జైశంకర్​.. పోస్టల్​ స్టాంప్​ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో ఐరాస దశాబ్దాలుగా కృషి చేస్తోందని ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నిజంగా అవి 'డైనోసార్‌ గుడ్లే'నా?

తమిళనాడులో ఇటీవల వింతైన అవశేషాలు బయటపడ్డాయి. కున్నా జిల్లా ప్రజలు జరిపిన తవ్వకాల్లో బంతి ఆకారంలో ఉన్న అవశేషాలు కలకలం రేపాయి . ఇవి డైనోసార్‌ గుడ్లేనంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. భారీ ఆకృతుల్లో ఉన్న వీటిని ఫొటోలు తీసిన కొందరు డైనోసార్‌ గుడ్లుగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'కోలుకుంటారో.. నిరాశలో కూరుకుపోతారో తేల్చుకోండి'

డెమోక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​ లక్ష్యంగా మరోమారు తీవ్ర విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు ఓటు వేసి.. కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటారో, లేక బైడెన్​ను గెలిపించి నిరాశావాదంలో కూరుకుపోతారో తేల్చుకోవాలని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు అయ్యే సామర్థ్యం బైడెన్​కు లేదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పండుగ సీజన్​లో కొనుగోళ్లు.. ఈ తప్పులు మీరూ చేస్తున్నారా?

పండుగ సీజన్​లో వివిధ సంస్థలు, ఆన్​లైన్ కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులైన కొందరు వినియోగదారులు... అవసరమున్నా, లేకపోయినా.. వెనకా ముందు ఆలోచించకుండా బట్టలు, నగలు, ఎలక్ట్రానిక్​ వస్తువులు​ కొనుగోలు చేసేస్తుంటారు. అంతా అయిపోయిన తర్వాత అయ్యే ఇది అనవసరంగా కొన్నానంటూ బాధపడుతుంటారు. పండుగ సీజన్​లో సాధారణంగా ఈ తప్పులు జరుగుతుంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని, ప్రణాళిక ప్రకారం డబ్బు ఖర్చు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇటలీలో శిక్షణ ప్రారంభించిన భారత బాక్సర్లు

ఇటలీలోని ఒలింపిక్స్ కేంద్రంలో భారత బాక్సర్లు తమ ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. 10 మంది పురుష బాక్సర్లు ఈ ప్రాక్టీస్​లో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కాజల్ ఎంగేజ్​మెంట్​ రింగ్​ ఇదేనా!

నటి కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. తన స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహమాడనున్నారు. అక్టోబర్ 30న వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కుమార్తెగా ఏడడుగులు వేసే సమయంలో తన ప్రియనేస్తం చూపులను ఆకట్టుకునేందుకు కాజల్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా తన చేతివేళ్లను చూపిస్తూ ఇన్​స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.