ETV Bharat / city

ఆ కుటుంబాల ఇంటి పేర్లే.. గ్రామ పంచాయతీలు

ప్రాంతాలు, చారిత్రక విశిష్టత ఆధారంగా ఎక్కడైనా పంచాయతీలు ఏర్పాటవుతుంటాయి. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రెండు పంచాయతీలు మాత్రం... రెండు కుటుంబాల ఇంటిపేర్ల మీదుగా ఏర్పడ్డాయి. వెనుకబడిన కులాలకు రిజర్వ్‌ అయితే తప్ప.. ఆయా కుటుంబసభ్యులే అక్కడ సర్పంచ్‌ పీఠాన్ని అధిరోహిస్తుంటారు. జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అవార్డులు సాధించేలా అభివృద్ధి చేస్తున్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికలు
ap local polls 2021
author img

By

Published : Jan 31, 2021, 8:33 AM IST

కుటుంబాల ఇంటి పేర్లతో గ్రామ పంచాయతీల ఏర్పాటు

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని లక్కలపూడివాండ్లూరు, సామిరెడ్డిపల్లె గ్రామాలు...దశాబ్దాలుగా సర్పంచి పదవి చేపట్టిన నేతల ఇంటిపేర్లతో ఏర్పడ్డాయి. పెనుమూరు మండలంలోని చిన్నమరెడ్డికండ్రిగ గ్రామం.. గతంలో పంచాయతీగా ఉండేది. దీనిపరిధిలో చిన్నమరెడ్డికండ్రిగతో పాటు బండమీదూరు, చీకలగుట్ట, వెంకటేశపురం, వాసుదేవపురం, కలికిరివాండ్ల ఊరు, లంకిపల్లె గ్రామాలు ఉండేవి. చిన్నమరెడ్డి గ్రామ పంచాయతీకి సర్పంచ్‌లుగా లక్కలపూడి కుటుంబీకులు ఎక్కువ కాలం పనిచేశారు. లక్కలపూడి వెంకటాద్రి నాయుడు పదేళ్లు.. ఆయన చిన్నాన్న కుమారుడు లక్కలపూడి మునిస్వామినాయుడు ఒకసారి సర్పంచిగా ఎన్నికయ్యారు. అనంతరం వెంకటాద్రినాయుడు కుమారుడు లక్కలపూడి మునిరత్నం నాయుడు చిన్నమరెడ్డికండ్రిగ సర్పంచుగా, ఉప సర్పంచుగా పనిచేసి తమ కుటుంబ ప్రాభవాన్ని మరింత పెంచారు.

పంచాయతీ కేంద్రం చిన్నమరెడ్డికండ్రిగ, మిగిలిన గ్రామాల మధ్య దూరం ఎక్కువగా ఉండటంతో... తాము నివాసం ఉంటున్న ప్రాంతంలో పరిసర గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో 1995 సంవత్సరంలో చిన్నమరెడ్డికండ్రిగ నుంచి వెంకటేశపురం, వాసుదేవపురం, కలికిరివాండ్ల ఊరు, లంకిపల్లె గ్రామాలు విడిపోగా... ఓ కొత్త పంచాయతీ ఏర్పడింది. ఆ గ్రామాల్లో లక్కలపూడి ఇంటిపేరుతో ఉన్నవాళ్లు ఎక్కువగా ఉండటంతో... పరిసర గ్రామ ప్రజల ఆమోదం మేరకు లక్కలపూడివాండ్లూరు పేరుతో పంచాయతీ ఏర్పాటు చేశారు. చిన్నమరెడ్డికండ్రిగ పంచాయతీని బండమీదూరు, చీకలగుట్ట గ్రామాలతో కలిపి మరో పంచాయతీగా కొనసాగించారు. 1995 నుంచి రెండుసార్లు మినహా.. మిగిలిన అన్నిసార్లూ లక్కలపూడి కుటుంబసభ్యులే సర్పంచ్‌గా పనిచేశారు. ఆ రెండుసార్లూ తమ అనుచరులునే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2013లో మునిరత్నంనాయుడు కోడలు శాంతి సర్పంచ్‌ అయ్యారు. అప్పటివరకూ రాజకీయ అనుభవం లేకపోయినా.. ఆయాచితంగా పదవి దక్కినా... గ్రామాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారు. 2017లో స్వశక్తికరన్‌ పురస్కార్‌ అవార్డు దక్కించుకున్నారు.

ఇంటిపేరు మీదే గ్రామ పంచాయతీలు ఉండటం గర్వంగా ఉన్నా... అంతేస్థాయిలో ఒత్తిడి ఉంటుందని... అంచనాలు అందుకునేందుకు కష్టపడాల్సి వస్తుందని లక్కలపూడి కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి 'తీవ్ర పరిణామాలు తప్పవు'... సీఎస్​కు ఎస్​ఈసీ నిమ్మగడ్డ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.