జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడుతున్నాయి. మెహదీపట్నంలో ఎంఐఎం బోణి కొట్టింది. ఈ స్థానంలో మజ్లిస్ అభ్యర్థి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ గెలుపొందారు.
ఆధిక్యాల్లో అత్యధికం పోస్టల్ ఓట్ల ఫలితాలే ఉన్నాయి. ఇప్పుడే తొలి రౌండ్ ఫలితాలు ప్రారంభమయ్యాయి. బాలాజీనగర్, పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్, శేరిలింగంపల్లి డివిజన్లలో తొలి రౌండ్‌లో తెరాస ఆధిక్యంలో ఉంది. కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్ల తొలి రౌండ్‌లో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మరో 2 గంటల్లో పూర్తి ఫలితాలు వచ్చే అవకాశముంది.
- ఇదీ చదవండి: ఐపీఎల్ ఫ్రాంచైజీ రేసులో అహ్మదాబాద్, కాన్పూర్