సంక్రాంతి, కనుమ పండగ రోజుల్లో గాలిపటాలు ఎగురవేయడమంటే పిల్లలకు భలే సరదా. గాలిలో చాలా ఎత్తుగా మెలికలు తిరుగుతూ పతంగి ఎగురుగుతుంటే పిల్లలు ఆనందంతో కేరింతలు కొడతారు. ఇలాంటి సంతోషం.. విషాదంగా మారకూడదంటే గాలిపటం ఎగురవేసే సమయంలో పెద్దలు.. వారికి దగ్గరగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని గుంటూరు జిల్లా విద్యుత్ శాఖ అధికారులు.. ప్రజలను అప్రమత్తం చేశారు.
విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండే ప్రాంతాల్లో గాలి పటాలు ఎగురవేయవద్దని సూచిస్తున్నారు. ఇవి లేకుండా ఉండే ఖాళీస్థలంలో పతంగులు ఎగురవేయాలని విద్యుత్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గాలిపటం విద్యుత్ వైర్లు, ట్రాన్సుఫార్మర్లకు చుట్టుకుంటే దారం ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశముందని హెచ్చరించారు. పిల్లలు బిల్డింగ్ పైన గాలిపటం ఎగరవేకుండా పెద్దలు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: