ETV Bharat / city

నామినేషన్ల స్వీకరణకు కానరాని అధికారులు..

రాష్ట్ర వ్యాప్తంగా నేడు స్థానిక ఎన్నికల నామినేషన్ పత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావలసి ఉండగా.. అధికారులు అందుబాటులో లేక పోవడంతో అభ్యర్థులు వెనుదిరిగారు. నామినేషన్ల ప్రక్రియతో సందడిగా ఉండాల్సిన ఎంపీడీవో కార్యాలయాలు వెలవెలబోయాయి. కొన్ని చోట్ల తెదేపా శ్రేణులు దీనిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

no officials available to take nomination papers
నామినేషన్ల స్వీకరణకు కానరాని అధికారులు
author img

By

Published : Jan 25, 2021, 5:55 PM IST

ఎన్నికల కమిషన్​ ఆదేశాల మేరకు ఇవాళ ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణ రాష్ట్రంలో జరగవలసి ఉంది. కానీ మెుదటి రోజు నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు వెళ్లగా అధికారులు వారినుంచి పత్రాలు స్వీకరించకపోవడంతో హై డ్రామా చోటుచేసుకుంది. ఆశగా వెళ్లిన అభ్యర్థులు కొన్ని చోట్ల అధికారుల సమాధానం విని గందరగోళానికి గురవగా.. మరికొన్ని చోట్ల అధికారులతో వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం హైకోర్టు ఆదేశాలు ఎస్ఈసీకి అనుకూలంగా వచ్చినా.. ఆ కోలాహలం ఎక్కడా కనిపించలేదు. అనేక చోట్లో అధికారులు అందుబాటులో లేకపోవడంపై తెదేపా అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట నిరసలు చేశారు.

కృష్టా జిల్లాలో..

ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఎన్నికలకు సంబంధించి ఆదేశాలు అందకపోవడంతో కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో పంచాయతీ ఎన్నికల హడావిడి కనిపించలేదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉన్నా.. ఇందుకు సంబంధించి మెటీరియల్​, జిల్లా అధికారుల ఆదేశాలు అందకపోవడంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నూజివీడు ఎంపీడీవో కార్యాలయంలో ఎటువంటి నోటీసు ప్రదర్శించలేదు. అధికారుల ఆదేశానుసారం ఎప్పుడైనా ఎన్నిక ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు నూజివీడు ఎంపీడీవో రాణి తెలిపారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నామినేషన్ల పత్రాలు ఇవ్వకపోవడంతో సర్పంచ్ అభ్యర్థులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. హొట్టేబెట్ట, దొడ్డేరి, రొళ్ల గ్రామపంచాయతీలకు నామినేషన్ వేయడానికి పత్రాలకోసం అధికారులను సంప్రదించగా.. అధికారులు ఇవ్వలేమనడంతో అభ్యర్థులు ధర్నాకు దిగారు. నామినేషన్ పత్రాలు, ఓటర్ లిస్ట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో..

పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా.. నెల్లూరు జిల్లాలో మాత్రం ఎలాంటి ఏర్పాట్లు కానరాలేదు. జిల్లాలో 946 పంచాయతీలు ఉండగా.. మొదటి విడత కింద నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతుండటంతో.. పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. నామినేషన్ పత్రాలు సైతం పంచాయతీ కార్యాలయాలకు అందలేదని గ్రామాధికారులు చెబుతున్నారు. గ్రామ కార్యదర్శి తోపాటు సిబ్బంది తమ తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఎన్నికల హడావుడి ఎక్కడా కనిపించలేదు.

కడప జిల్లాలో..

నామినేషన్ల ప్రక్రియతో సందడిగా ఉండాల్సిన ఎంపీడీవో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు ఎన్నికల నిర్వహణకు మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక్క చోట కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. తొలిదశలోనే ఫిబ్రవరి 5వ తేదీన జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియ నిర్వహించలేదని ఎంపీడీవోలు చెబుతున్నారు. అన్నీ సజావుగా జరిగి ఉంటే జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం ,ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలయ్యేది.

చిత్తూరు జిల్లాలో..

చంద్రగిరి మండల కార్యాలయం ముందు చంద్రగిరి తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్​ను తీసుకోవడానికి ఎంపీడీవో అధికారి రాధమ్మ లేకపోవడంతో.. కిందిస్థాయి ఉద్యోగులు నామినేషన్ పత్రాలను తీసుకోకపోవడంతో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఇవ్వడానికి వెళ్లగా అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో అధికారులను సంప్రదించగా జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు అందలేదని.. అందిన వెంటనే నామినేషన్లను స్వీకరిస్తారన్నారు. తెదేపా నాయకులు చంద్రగిరి మండల అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్లో అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నామినేషన్ వేసేందుకు హాజరైన అభ్యర్థులు వెనుదిరిగారు. మండలంలోని రామలింగాపురం, ఉడుములపాడు, తొండమనాడు, ఎగువ వీధి పంచాయతీల నుంచి నామినేషన్ వేసేందుకు తెదేపా అభ్యర్థులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో టేబుల్ పై నామినేషన్ పత్రాలు ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు భయపడి వ్యతిరేకిస్తోందన్నారు.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైనా.. అధికారులు కార్యాలయంలో కనిపించ లేదు. దీంతో మొదటి రోజు నామినేషన్ దాఖలు కాలేదు. అధికారులు తప్పించుకునేందుకు అనేక కారణాలు చెబుతూ విధులకు డుమ్మా కొట్టారు.

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి.. నామినేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మండల పరిషత్ కార్యాలయానికి తాళాలు వేసిఉంది. కార్యాలయాల్లో అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. నామపత్రాల కోసం వచ్చినా తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఇతర నాయకులు కార్యాలయానికి వచ్చారు. అధికారులు ఎవరూ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కింద స్థాయి సిబ్బంది గమనించి.. వెంటనే నామ పాత్రలు, ఓటర్ లిస్ట్ వెంటనే ఇవ్వాలని అధికారులను కోరారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసేందుకు వెళ్లిన అభ్యర్థులకు అక్కడ నామినేషన్లు తీసుకునేందుకు అధికారులు లేని పరిస్థితి ఎదురయ్యింది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద వివిధ పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు తీసుకోవలసి ఉంది. ఈ పంచాయతీ కార్యాలయానికి నామినేషన్లు వేసేందుకు వెళ్లగా ఎన్నికల అధికారులు అందుబాటులో లేని దుస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అమలాపురం డివిజన్ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వారు వాపోయారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు అధికారులు లేకపోవడంతో తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.