ETV Bharat / city

మరో పెగ్గు..ఇంకో పెగ్గు అన్నట్లుగా బార్లకు కొనసాగుతున్న ఈ-వేలం.. - కొనసాగుతున్న ఈ వేలం

BAR LICENSE: రాష్ట్రంలో కొత్తగా బార్ల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటకు పలు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. చిన్న పట్టణాల్లోనే రూ.కోటికి పైగా ధరలు పలుకుతున్నాయి. నేటినుంచి మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి.

BAR LICENSE
BAR LICENSE
author img

By

Published : Jul 30, 2022, 5:32 PM IST

Updated : Jul 30, 2022, 7:44 PM IST

BAR LICENSE: రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సింగ్ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-1, జోన్-4లలో బిడ్లను అధికారులు తెరిచారు. రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ బార్లకు రీ-బిడ్డింగ్ జరుగుతోంది. నేటినుంచి మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు నమోదైన బార్​ల వేలం వివరాలు..

VISAKHA: విశాఖ మహానగరంలో 128 బార్లకు దరఖాస్తులకు ఆహ్వనించగా.. 120 బార్లకు అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులు వచ్చిన వాటిలో 119 బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్​శాఖ పచ్చజెండా ఊపింది. కాకపోతే విశాఖలో గరిష్ఠంగా రూ.60 లక్షల ధర మాత్రమే పలికింది.

KURNOOL: జిల్లా వ్యాప్తంగా 27 బార్లకు లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో ఈ వేలం నిర్వహించగా.. కేవ‌లం 36 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కర్నూలులో 18 బార్లకు 23 మంది అప్లై చేసుకొగా.. ఆదోనిలో 5 బార్లకు 6 మంది.. ఎమ్మిగనూరులో 3 బార్లకు 5 మంది.. గూడూరులో ఒక్క బారుకు కేవలం ఇద్దరు మాత్రమే అప్లై చేసుకున్నారు. వీరులో లైసెన్స్ కు చెల్లించాల్సిన డబ్బుకు సరిపడా కోడ్ చేసిన వారిని ఎంపిక చేశారు.

TIRUPATHI: తిరుపతిలోని 16 బార్లకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహిస్తున్నారు. అత్యధికంగా రూ.కోటీ 59 లక్షలు పలకగా.. అత్యల్పంగా రూ.కోటీ 49 లక్షలు పలికిన బార్‌ ధరలు.

YSR KADAPA: కడపలోని ఓ బార్‌కు కోటీ 71 లక్షలు, ప్రొద్టుటూరులో ఒక బార్‌కు కోటీ 30 లక్షలు రూపాయల బిడ్ దాఖలైంది.

VIZIANAGARM: విజయనగరం జిల్లాలో 27 బార్లకు ఈ-వేలం ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 26 బార్లకు లైసెన్స్​లు ఖరారు చేశారు. రాజాంలో గరిష్ఠంగా రూ.77 లక్షలు.. నెల్లిమర్లలో కనిష్ఠంగా రూ.17 లక్షలు ధరలు పలికాయి. విజయనగరం జిల్లాలో అన్ని బార్లకు రూ.12.22 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 30, 2022, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.