అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐబీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. హోం మంత్రి సుచరిత కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ మధ్య కాలంలో సచివాలయంలో కొంత మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: