డీఎస్సీ-2008 అభ్యర్థుల నియామకాలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియ మార్పు కారణంగా నష్టపోయిన 2,193 మందిని ఒప్పంద ప్రాతిపదికన ఎస్జీటీలుగా నియమించనున్నారు. జిల్లాల వారీగా శనివారం కౌన్సెలింగ్ పూర్తి చేసి.. మూడు, నాలుగు కేటగిరీ పాఠశాలల్లో పోస్టింగ్ ఇస్తారు. రిలీవర్ లేక బదిలీ కాలేకపోయిన ఉపాధ్యాయుల స్థానాలు, 40మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న ఏకోపాధ్యాయ బడుల్లో వీరికి ప్రాధాన్యం ఇస్తారు.
ఇదీ చదవండి: COMMON ENTRANCE TESTS: రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల