డీఎస్సీ-2008లో ఎంపిక ప్రక్రియ మార్పు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 4,657 మందిని ఒప్పంద ఉపాధ్యాయులుగా నియమించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)గా నియమిస్తారు. కనీస టైం స్కేల్ రూ.21,230 జీతంతో పదవీ విరమణ వరకు పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి అంగీకార పత్రాలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగాల్లో చేరేందుకు అంగీకారం తెలిపిన అభ్యర్థుల జాబితాను ఈనెల 18లోపు పంపించాలని సూచించింది. వీరు ఎస్జీటీలుగా చేరిన రెండేళ్లలోపు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం ఆరు నెలల ప్రాథమిక విద్య బ్రిడ్జి కోర్సును పూర్తిచేయాలి.
ఇదీ చదవండి: