Jagtial RTC BUS Accident : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు టైరు పేలి రోడ్డు పక్కన మురికి కాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా... 44మంది ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. జగిత్యాల నుంచి నిర్మల్ వెళ్తున్న బస్సు మల్కాపూర్ సమీపంలోకి చేరుకోగానే ముందు టైరు పేలిపోయింది. బస్సును నియంత్రించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన డ్రైవర్.... తలుపు తెరుచుకుపోవడం వల్ల కాల్వలో పడి తీవ్రంగా గాయపడ్డారు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి తమ ప్రాణాలు కాపాడి.. తన ప్రాణాలు కోల్పోయాడని ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు.