ETV Bharat / city

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసి 15 నెలలు దాటినా... ఎన్నికలు నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయకపోతే..మీరేం చేశారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించింది. ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశిస్తూ...విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా
author img

By

Published : Nov 15, 2019, 6:04 AM IST

Updated : Nov 15, 2019, 12:05 PM IST

గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వ జాప్యం చేస్తోందంటూ హైకోర్టు మండిపడింది. పంచాయతీల కాలపరిమితి ముగిసి 15 నెలలు దాటినా... ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చి 13 నెలలు పూర్తైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ చర్య ఏకపక్షంగా ఉందని..ఎన్నికలు నిర్వహించకపోవటం కోర్టు ఉత్తర్వులు, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ... వ్యాఖ్యానించింది. రిజర్వేషన్ల ఖరారులో సర్కారు జాప్యం చేస్తుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తన అధికారాన్ని ఎందుకు వినియోగించుకోలేదో అర్థం కావటం లేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. కోర్టు ఆదేశాలను పట్టించుకోని అధికారుల సంగతి మేము చూసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

రాష్టవ్యాప్తంగా 12 వేల 775 గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ న్యాయవాది తాండవ యోగేష్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా.. కోర్టు విచారణ చేపట్టింది. ప్రమాణపత్రంలో క్షమాపణలు కోరుతున్నారే తప్ప..కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయటం లేదో స్పష్టమైన కారణాలు పేర్కొనకుండా దాఖలు చేశారంటూ....ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీఎస్‌ను ఆదేశించింది. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలను...తమ ఎదుట ఉంచాలని ఎన్నికల సంఘం కార్యదర్శిని ఆదేశించింది. ప్రమాణపత్రం దాఖలు చేయడంలో విఫలమైతే సీఎస్, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి తదుపరి విచారణకు హాజరుకావాలని తేల్చిచెప్పింది. సీఎస్‌ను ప్రమాణపత్రం దాఖలు చెయ్యాలని గత విచారణ సమయంలో ఆదేశించినా విఫలమయ్యారనని తప్పుబట్టింది.

రాష్ట్రంలో విపత్తుల వల్లే ఎన్నికలు నిర్వహించలేకపోయామని ప్రభుత్వం తరపు న్యాయవాది... హైకోర్టుకు వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక.. గ్రామ సచివాలయాలు ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ కారణంగా ఎన్నికల నిర్వహణ ఆలస్యమైనట్లు తెలిపారు. వచ్చే ఏడాదిమార్చిలోగా ప్రక్రియ పూర్తి చేస్తామని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న తర్వాత విచారణను ఈనెల 21 కి హైకోర్టు వాయిదా వేస్తూ...20వ తేదీలో ప్రమాపత్రం దాఖలు చెయ్యాలని తేల్చిచెప్పింది.

ఇదీచదవండి

మసీదులో ప్రార్థన వినగానే... చంద్రబాబు ఏం చేశారో తెలుసా..?

sample description
Last Updated : Nov 15, 2019, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.