ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై కావాలనే ఆరోపణలు: డీజీపీ - dgp gowtham sawang on elections latest news

పంచాయతీ ఎన్నికలపై కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రతిచోటా వీడియో ఫుటేజీలు, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా తప్పు చేస్తే దర్యాప్తులో కచ్చితంగా తెలిసిపోతుందన్నారు.

dgp gowtham sawang
dgp gowtham sawang
author img

By

Published : Feb 2, 2021, 7:01 AM IST

పంచాయతీ ఎన్నికలపై కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విమర్శించారు. మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిచోటా వీడియో ఫుటేజీలు, సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా తప్పు చేస్తే దర్యాప్తులో కచ్చితంగా తెలిసిపోతుందన్నారు.

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేశామని తెలిపారు. కొందరు ప్రతీదాన్ని రాజకీయం చేస్తూ చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తున్న పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొంతమంది సీన్‌లో కనిపించకుండా వెనుకుండి నడిపించటం, ఫోన్‌ చేసి బెదిరించటం వంటివి మీడియాల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి కదా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అదే వ్యక్తులు తిరిగి తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల తర్వాతే పోలీసులకు వ్యాక్సిన్‌

‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తయిన తర్వాతే పోలీసు సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియ నిర్వహిస్తాం. రాజ్యాంగబద్ధ విధులు నిర్వహించేందుకు వీలుగా వ్యాక్సిన్‌ వేయించుకోవటాన్ని వాయిదా వేసుకుంటామని పోలీసు అధికారుల సంఘం నిర్ణయించింది. పోలీసు అధికారులెవరూ అప్పటివరకూ వ్యాక్సిన్‌ వేసుకోరు’’ అని డీజీపీ అన్నారు.

ఇదీ చదవండి:

ఆరోగ్య రంగానికి రెట్టింపు వ్యయం- కొత్తగా అగ్రిసెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.