మున్సిపల్ ఎన్నికలు, కరోనా వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం సమస్యే అన్నారు.. డీజీపీ గౌతం సవాంగ్. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఎస్ఈసీ నిర్వహించిన సమీక్షకు.. ఆయన హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై వారికి ఎస్‌ఈసీ దిశానిర్దేశం చేశారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. ఈ వివరాలను డీజీపీ.. విలేకరులకు వెల్లడించారు.
"ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి నిర్వహించడం సమస్యే. సమస్యను అధిగమించడంపై చర్చిస్తున్నాం. జిల్లాల్లో పోలీస్ బలగాల సన్నద్ధతపైనా చర్చించాం. ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చలు జరిగాయి. పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత, భద్రతా అంశాలపై చర్చించాం. ఎన్నికలతో పాటు పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంది. ఒకే సమయంలో పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ సమస్యగా మారింది. సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ గుర్తించాం. సాధారణ, సున్నిత, అతి సున్నిత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం" - గౌతం సవాంగ్, డీజీపీ
ఇదీ చదవండి:
స్థానిక పోరు ఏర్పాట్లపై ఎస్ఈసీ సమీక్ష.. సీఎస్, డీజీపీ హాజరు