ETV Bharat / city

రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలను ఉపేక్షించం:డీజీపీ - social media posts against judges

సామాజిక మాధ్యమాల్లో రాజ్యాంగ సంస్థలు, వ్యక్తులపై వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుల పట్ల కొందరు వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు అందిందని...దర్యాప్తు వేగవంతం చేశామని తెలిపారు.

dgp gowtham sawang
dgp gowtham sawang
author img

By

Published : May 27, 2020, 7:39 PM IST

వివిధ మాధ్యమాల్లో ప్రచురణలు, ప్రసారాలపై, పోస్టులపై డీజీపీ సవాంగ్‌ కీలక ప్రకటన చేశారు. అభిప్రాయాలు చెప్పేవాళ్లు నియంత్రణ పాటించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణం లేకపోవడంతో కొన్నిసార్లు వ్యాఖ్యలు, దూషణల నుంచి వైషమ్యాల వైపు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు సమాజానికి, వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ తరహా పోకడలను అరికట్టేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని డీజీపీ సవాంగ్ వెల్లడించారు.

'రాజ్యాంగ సంస్థలు, వ్యక్తులపై వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అభిప్రాయ వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలి. అశ్లీల, అసభ్యకర, నిందాపూర్వక వ్యాఖ్యానాలు తగవు. బాధ్యులపై నిష్పక్షపాతంగా ముందుకెళ్తాం. హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశాం. హైకోర్టు తీర్పుల పట్ల కొందరు వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు అందింది. ప్రభుత్వ పెద్దలపై తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంపైనా కూడా దృష్టి పెట్టాం' - డీజీపీ, గౌతం సవాంగ్

ఇదీ చదవండి:

న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. వ్యక్తిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.