రాష్ట్రంలోని హోంగార్డులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ 58వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హోం గార్డులకు వేతనాల పెంపు, బీమా వర్తింపు అమలు చేస్తున్నామన్నారు. వేతనం రోజుకు రూ.600 నుంచి 710కి పెంచామని గుర్తు చేశారు. అలాగే 15 వేల మంది హోంగార్డు కుటుంబాలకు యాక్సిస్ బ్యాంకు ఇన్సూరెన్స్ పథకంతో అనుసంధానం చేశామని డీజీపీ తెలిపారు. దీని ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 1 నుంచి ఆకస్మిక మరణం సంభవిస్తే... హోంగార్డు కుటుంబానికి 60 లక్షల బీమా చెల్లిస్తామన్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఈ ఏడాది 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు.
ఇప్పటి వరకు 12,500 హోంగార్డులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులు జారీ చేశారని తెలిపారు. మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తున్నామన్నారు. అందరికీ ఇళ్లు పథకం కింద ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు అర్హత ఉన్నవారికి ఇళ్లను కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: