ఆంధ్రప్రదేశ్ పోలీస్, అపోలో ఆస్పత్రి వైద్యుల సమన్వయంతో కరోనా నివారణకు పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స పై అన్ని జిల్లాల ఎస్పీలు, డీఐజీలు, డీఎస్పీలు, ఎస్‌హెచ్‌ఓలతో డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. ఇప్పటికే పోలీస్ శాఖలో 96శాతం మొదటి డోస్, 76శాతం రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యిందని ఆయన తెలిపారు.
మిగిలిన సిబ్బందికి సైతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న పోలీసులు కరోనా బారిన పడకుండా రక్షించుకోవడం ద్వారా, ఈ సమాజాన్ని రక్షించుకోవచ్చని సూచించారు. కరోనా వైరస్ పై సిబ్బందికి మరింత అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. కాలంతో పాటు మరిన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కరోనా బారిన పడి చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులుగా తిరిగిరావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైరస్‌ను జయించిన పోలీస్ సిబ్బంది, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. పోలీసుల త్యాగాలను గుర్తించి కరోనాపై తీసుకోవాల్సిన చర్యలపైన చక్కగా వివరించినందుకు ఆపోలో హాస్పిటల్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చదవండి: