అమరావతిని అటకెక్కించడానికే పీటర్ కమిటీ తరహాలో డి.ఎన్.రావు కమిటీ వేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రం తిరోగమనంలో ఉందని జాతీయ పత్రికలు చెప్పాయన్న ఆయన.. పీపీఏల రద్దుతో రాష్ట్ర ప్రయోజనాలతోపాటు జాతీయ ప్రయోజనాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. ఫాస్టిస్ట్ విధానాలు అవలంబిస్తున్న జగన్మోహన్రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన కంటే ఘోరంగా ఉందని ధ్వజమెత్తారు. వంద రోజుల పరిపాలన వైఫల్యాలను ఏడు జాతీయ పత్రికలు ఎడిటోరియల్స్‌లో ఎత్తి చూపాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్‌తో మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. 16వ తేదీ నుంచి నిరసనలు వ్యక్తం చేస్తామని దేవినేని స్పష్టం చేశారు.
కావాలనే దాడులు
తెదేపా నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషనులో ఉంచారనీ.. అచ్చెన్నాయుడు మీద కోర్టులో అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న తమ నేతలపై కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..