రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీల సత్వర పరిష్కారానికి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసిజర్స్(ఎస్ఓపీ) విధానాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్టమైన విధాన రూపకల్పన చేయాల్సిందేనని సీఎస్ స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. స్పందన కార్యక్రమంపై స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసిజర్స్ అన్ని శాఖల కార్యదర్శులు కూలంకషంగా చర్చించి అమలులోకి తెచ్చేందుకు ఈనెల 9వ తేదీన సచివాలయంలో మరొమారు కార్యశాల నిర్వహిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు, ఆయా శాఖాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈలోగా ఎస్ఓపీపై శాఖలవారీగా పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
ఫిర్యాదులపై 'స్పందన'కు నూతన విధానం - స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్స్
స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఎస్ఓపీ విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎస్ సుబ్రమణ్యం ఆదేశించారు.
![ఫిర్యాదులపై 'స్పందన'కు నూతన విధానం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4641492-426-4641492-1570116443539.jpg?imwidth=3840)
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అర్జీల సత్వర పరిష్కారానికి స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసిజర్స్(ఎస్ఓపీ) విధానాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఫిర్యాదుల పరిష్కారానికి నిర్దిష్టమైన విధాన రూపకల్పన చేయాల్సిందేనని సీఎస్ స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. స్పందన కార్యక్రమంపై స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రోసిజర్స్ అన్ని శాఖల కార్యదర్శులు కూలంకషంగా చర్చించి అమలులోకి తెచ్చేందుకు ఈనెల 9వ తేదీన సచివాలయంలో మరొమారు కార్యశాల నిర్వహిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు, ఆయా శాఖాధిపతులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఈలోగా ఎస్ఓపీపై శాఖలవారీగా పూర్తి స్థాయిలో నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
Body:కె.వెంకటరమణ,
Conclusion:9490877172