తమ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరస్సన్నపేట మండలం మండపాం గ్రామ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానున పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రతిపక్ష తెదేపా అడ్డంకులు సృష్టిసోందని ఆరోపించారు. ప్రతిపక్షం కలిసి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతున్నారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో తాను మాట్లాడిన ప్రసంగాన్ని ఓ టీవీ ఛానల్ వక్రీకరించి దుష్ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేంటో అనేది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు.
'పేదలకు ఇళ్లపట్టాలను ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తే ప్రతిపక్ష తెదేపా అడ్డుకుంది. ఇలాంటి విధానం సరికాదు. ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ మేం ఉన్నాం. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోండి. ప్రతిదానికి అడ్డుచెప్పడం సరికాదు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలకండి. తప్పు జరిగితే విమర్శించండి..కానీ సద్విమర్శలా ఉండాలి. ప్రతిదానిపై బురదజల్లటం భావ్యం కాదు. చంద్రబాబునాయుడు గారూ చాలా కాలం పరిపాలించారు. ఆయన కూడా చక్కగానే చేశారు. జగన్ సీఎం అయినా తరువాతే ఆయనలో మార్పు వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు సహకరించండి. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయండి' - ఉపముఖ్యమంత్రి, ధర్మాన కృష్ణదాస్
ఇదీ చదవండి