పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్.. లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ఇప్పటివరకు రూ.11,600 కోట్లు రీయింబర్స్ చేశామన్న జలశక్తి శాఖ... పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫారసుతో ఆర్థిక శాఖ ఆ ప్రక్రియ చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రం చేసిన ఖర్చు బిల్లులు పరిశీలించాక రీయింబర్స్ చేస్తామని కేంద్రం స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్ నుంచి పోలవరం నిర్మాణ ఖర్చును వంద శాతం తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేశారు. అయితే... తమ తరఫున రాష్ట్రమే పోలవరం నిర్మాణం చేపడుతోందని సమాధానంలో వివరించారు.
ఇదీ చదవండి:
Chandrababu: 'భారీగా అప్పులతో.. అవినీతి, దుబారా చేస్తున్నారు'