ETV Bharat / city

Telangana: బీ అలర్ట్.. గాలి ద్వారా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి: డీహెచ్‌ శ్రీనివాసరావు

delta variant
delta variant
author img

By

Published : Jul 20, 2021, 3:37 PM IST

Updated : Jul 20, 2021, 4:11 PM IST

15:33 July 20

delta variant

తెలంగాణలో డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాసరావు తెలిపారు. డెల్టా వేరియంట్‌ ప్రభావం మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటించాయని.. ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు.

'రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. వరుస పండుగల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే తీవ్రతను పట్టించుకోకుండా కొంతమంది ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టారు. కొవిడ్ జాగ్రత్తలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. డెల్టా వేరియంట్‌ గాలి ద్వారా వ్యాపిస్తోంది. ప్రజలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొనరాదు. మాల్స్‌కి గుంపులు గుంపులుగా వెళ్లడం సరికాదు' - శ్రీనివాసరావు, ప్రజారోగ్య శాఖ సంచాలకులు, తెలంగాణ

రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. లక్ష మంది వైద్య సిబ్బంది కరోనా కట్టడి కోసం నిరంతరం పని చేస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే వైద్య, పోలీసు, మున్సిపల్ సిబ్బంది అలిసిపోయారన్న ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.  

ఇదీ చదవండి

భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు

Last Updated : Jul 20, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.