దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలంతా తమ ఇళ్లలోని లైట్లను రాత్రి 9 గంటలకు నిలిపివేసిన కారణంగా.. విద్యుత్ వినియోగంపై గణనీయంగా ప్రభావం పడింది. రాష్ట్రంలో 1600 మెగావాట్ల వినియోగం తగ్గిపోయినట్టు రాష్ట్ర స్థాయి లోడ్ డిస్పాచ్ సెంటర్కు చెందిన వర్గాలు తెలియజేశాయి. అలాగే దేశ వ్యాప్తంగా 29 వేల మెగావాట్ల లోడ్ పడిపోయిందని స్పష్టం చేశాయి. గ్రిడ్ పై ప్రభావం చూపకుండా ముందస్తుగా విద్యుత్ ఉత్పత్తిని నియంత్రించిన కారణంగా.. సమస్యలు ఉత్పన్నం కాలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: