ETV Bharat / city

HOTMAIL SCAM: హాట్‌ మెయిల్‌ మెసేజ్​తో ఎర.. రూ.25 లక్షలు మాయం - నేర వార్తలు

లాటరీలు, బహుమతులు వచ్చాయంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నాయా? అయితే అప్రమత్తంగా ఉండాల్సిందే(cyber crimes types). సైబర్​ నేరగాళ్లు రోజుకో పంథాలో తమ రూటు మార్చుతున్నారు. వినియోగదారుల అవసరాలనే ఆసరాగా చేసుకొని ఎరవేస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ కేటుగాళ్ల వలలో చిక్కి ఎంతోమంది యువకులు మోసపోతున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తికి హాట్‌ మెయిల్(cyber crime through the hotmail message) ద్వారా సందేశం పంపి... రూ.25లక్షలు కాజేశారు.

HOTMAIL SCAM
HOTMAIL SCAM
author img

By

Published : Oct 4, 2021, 4:41 PM IST

దోపిడీలకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ఎంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు(cyber crimes types) ఏకంగా సెల్‌ఫోన్‌నే హ్యాక్‌ చేసేశారు. హాట్‌ మెయిల్‌ ద్వారా సందేశం(cyber crime through hotmail message) పంపిన సైబర్‌ నేరస్థులు ఓ వ్యక్తి ఫోన్‌ను హ్యాక్‌ చేసి అతని వ్యాలెట్‌ నుంచి రూ.25 లక్షలు కొట్టేశారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ డబ్బు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు... సైబర్‌ నేరగాళ్లు తొలిసారి సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. బాధితుడికి నేరగాళ్లు పంపించిన సందేశాల ఆధారంగా పోలీసులు మోసం(cyber crimes types) జరిగిన తీరును విశ్లేషించారు. అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోతారంటూ సెల్‌ఫోన్‌ వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.

బహుమతుల పేరిట ఎస్‌ఎంఎస్‌లతో ఎర

సైబర్‌ నేరగాళ్లు.. మొదట సెల్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. లాటరీలు, బహుమతులు అని ఎర వేస్తూ వారి ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. ఈ కేసులో బాధితుడికి కూడా ఇలాగే రెండు, మూడు ఎస్‌ఎంఎస్‌లు రాగా.. వాటిని యథాలాపంగా క్లిక్‌ చేశారు. వెంటనే ఆయన వివరాలన్నీ సైబర్‌ నేరగాడికి చేరిపోయాయి. ఇలా సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసిన ఆ నేరగాడు.. బాధితుడు బిట్‌ కాయిన్లను కొని వ్యాలెట్‌లో దాచుకున్నాడని గుర్తించాడు. ఆ వెంటనే 35 వేల అమెరికన్‌ డాలర్లను (దాదాపు రూ.25 లక్షలు) బదిలీ చేసుకున్నాడు. ఆ లావాదేవీల వివరాలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌లు, వ్యాలెట్‌ సందేశాలను అతడే ఫోన్‌లోంచి తొలిగించాడు. దీంతో బాధితుడు.. తన వ్యాలెట్‌లోని డాలర్లను కోల్పోయినట్లు వెంటనే గుర్తించలేకపోయారు. తర్వాత చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు ఓ ఎస్‌ఎంఎస్‌ యూఎస్‌ నుంచి, మరోటి ఆస్ట్రేలియా నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు.

హాట్‌ మెయిల్‌కు స్పందించొద్దు

హాట్‌ మెయిల్‌ ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. జీమెయిల్‌, యాహూ మెయిల్‌ ఖాతాల్లా హాట్‌ మెయిల్‌ ఖాతాలను ప్రారంభిస్తున్న నేరస్థులు అందులోకి టోర్‌టీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారని వివరించారు. దాని సాయంతోనే సెల్‌ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారన్నారు. వీరు కార్పొరేటు, ప్రైవేటు సంస్థల రహస్య వివరాలను కూడా సేకరించి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి:

THIEVES: తిరుపతి విద్యానగర్​లో దొంగల ముఠా హల్‌చల్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.