ETV Bharat / city

వివాహం పేరిట బురిడీ... ఘరానా మోసగాడు అరెస్టు

author img

By

Published : Aug 29, 2021, 8:27 AM IST

విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నా.. మంచి జీతం వస్తుందని వివాహ సంబంధింత వెబ్‌సైట్లలో పెడతాడు. అతన్ని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరిచే యువతులను లక్ష్యంగా చేసుకొని వీసా ఇప్పించి తనతో విదేశాలకు తీసుకువెళ్తానని డబ్బులు దండుకుంటాడు. ఇలా చాలా మందిని మోసం చేసి కటకటాల పాలయ్యాడు ఓ మాజీ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి.

వివాహం పేరిట బురిడీ... ఘరానా మోసగాడు అరెస్టు
వివాహం పేరిట బురిడీ... ఘరానా మోసగాడు అరెస్టు

వివాహం పేరిట యువతులను బురిడీ కొట్టిస్తున్న ఘరానా మోసగాడిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా బురానాపురంకు చెందిన బాల వంశీ కృష్ణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అయితే క్రికెట్‌ బెట్టింగ్‌, గుర్రపు పందాలు వంటి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఉద్యోగం కూడా పోయింది. దీంతో అతను మోసగాడిగా అవతారమెత్తాడు. తాను విదేశాల్లో ఉంటున్నానని... ఉన్నత ఉద్యోగం చేస్తున్నాని... వివాహ సంబంధింత వెబ్‌సైట్లలో పోస్టు చేసేవాడు. అతన్ని వివాహం చేసుకోవడానికి ఆసక్తి కనబరిచే యువతులను లక్ష్యంగా చేసుకొని వీసా ఇప్పించి తనతో విదేశాలకు తీసుకువెళ్తానని చెప్పి డబ్బులు దండుకొని అనంతరం తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేవాడు.

ఈ విధంగా సదరు మోసగాడు మోసం చేసినట్టు గతంలో నలుగురు బాధితురాళ్లు ఫిర్యాదు చేయడంతో వేర్వేరు కేసుల్లో సీసీఎస్‌, చైతన్యపురి, సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చి కూడా తన తీరు మార్చుకోకుండా మోసాలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తాజాగా చౌటుప్పల్‌కు చెందిన యువతిని ఇదే తరహాలో నమ్మించడంతో ఆమె 90 వేల రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా అతనికి పంపించింది. డబ్బులు తీసుకున్న తర్వాత ఎటువంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు చరవాణులు, మూడు బ్యాంకు చెక్‌ పుస్తకాలు, ఏటీఎం కార్డు, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: Brutal Murder: సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.