పంటల బీమా బకాయిలను ముఖ్యమంత్రి జగన్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2018 రబీ బీమా ప్రీమియం కింద రూ.596 కోట్లు చెల్లించినట్లు సీఎం తెలిపారు. రైతు బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు వెల్లడించారు. 5.49 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని సీఎం చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ-క్రాప్ నమోదు చేస్తామన్న ఆయన... ఆర్బీకేలు రైతులకు అన్నిరకాలుగా సాయం అందిస్తాయని వెల్లడించారు. ఈ-క్రాప్ పూర్తయిన వెంటనే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
'ఇకపై రైతులు కట్టాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. పాతఅప్పులు జమ చేసుకోకుండా అన్‌ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో బీమా డబ్బు జమ చేసేలా చర్యలు చేపట్టాం. రైతులు నష్టపోకుండా ఉండేందుకు బీమా ప్రక్రియలో సమూల మార్పులు చేస్తున్నాం. పంటల బీమా కోసం రైతులు నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడతాం. రైతులు రూపాయి బీమా కడితే చాలు... పంటల బీమా అమలవుతుంది. రైతు భరోసా కేంద్రాల వద్ద ఈ-క్రాప్ నమోదు చేస్తారు. రైతు భరోసా కేంద్రాల వద్దే రైతులకు అన్ని సౌకర్యాలతో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం'- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఇదీ చదవండి: