కృష్ణా కరకట్ట విస్తరణలో తమకు న్యాయం జరిగేంత వరకూ భూములను ఇచ్చేది లేదని రైతులు సీఆర్డీఏ అధికారులకు తేల్చి చెప్పారు. కరకట్ట విస్తరణ పనులను అడ్డుకున్న రైతులు.. తమకు నష్టపరిహారం అందించేంత వరకు భూముల్లో అడుగుపెట్టనివ్వమని రెండు రోజుల క్రితం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం రైతులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో అధికారులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు. ఉండవల్లి పొలాల్లో రైతులతో సీఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గజానికి రూ.10 వేలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయగా..రూ. 5000 ఇస్తామని అధికారులు చెప్పారు. అధికారుల ప్రతిపాదనలను రైతులు తోసిపుచ్చడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
ఇవీ చూడండి