అమరావతి పరిధిలో పేదలకు ఉచిత ఇళ్ల పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించింది. విజయవాడ, గుంటూరు, తాడేపల్లి, దుగ్గిరాల తదితర ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు అమరావతి పరిధిలో ఇళ్లపట్టాలివ్వనున్నారు. తొమ్మిది జోన్ల పరిధిలో పేదలకు నిర్ణయించిన స్థలాల్లో.. పొదల తొలగింపు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు , డీజీపీఎస్ సర్వే కోసం సీఆర్డీఏ టెండర్లు జారీ చేసింది. రూ.3.86 కోట్లతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి 9వ తేదీలోగా బిడ్ల దాఖలుకు గడువు విధించింది.
ఇదీ చదవండి: