CRDA NOTICES TO AMARAVATI FARMERS: రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 30లోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఈనెల 10లోగా నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఆర్డీఏ కమిషనర్ అదేశించారు.
గతంలో ఇచ్చిన నోటీసులకు రైతుల నుంచి ఎలాంటి స్పందన లేదని సీఆర్డీఏ కమిషనర్ తెలిపారు. కేవలం 929 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు. ఇంకా 17వేల మందికి పైగా రైతులు రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావట్లేదన్నారు. మరోవైపు తమకు కేటాయించిన ప్లాట్లను ముందు సీఆర్డీఏ అభివృద్ధి చేయాలని.. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని రాజధాని రైతులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అమరావతి రైతులకు సీఆర్‌డీఏ లేఖలు... ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచన