సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సీఎం జగన్కు లేఖ రాశారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం తగదన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి నెలకు రూ.5 వేలు నగదు, నిత్యావసర వస్తువులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: నల్లబజారులో రెమ్‌డెసివిర్