ETV Bharat / city

కరోనా వాక్సినేషన్​లో 8,9 స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​

author img

By

Published : Jan 29, 2021, 5:37 AM IST

కరోనా వాక్సినేషన్​లో వైద్య సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యంలో అత్యధిక మొత్తాన్ని పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 8, ఆంధ్రప్రదేశ్​ 9 స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో 40.3 శాతం, ఆంధ్రప్రదేశ్​లో 38.1 శాతం మందికి ఇప్పటివరకూ టీకా వేసినట్లు వెల్లడించింది.

covid vaccination for health workers report
కరోనా వాక్సినేషన్​లో తెలంగాణ 8, ఆంధ్రప్రదేశ్​ 9

కరోనా వాక్సినేషన్​కు నమోదిత వైద్య సిబ్బందిలో తెలంగాణలో 40.3 శాతం, ఆంధ్రప్రదేశ్​లో 38.1 శాతం మందికి ఇప్పటివరకూ టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిర్దేశించిన లక్ష్యంలో అత్యధిక మొత్తాన్ని పూర్తిచేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 8, ఆంధ్రప్రదేశ్​ 9 స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. వాక్సినేషన్​ మొదలైన తొలి రోజు (ఈ నెల 16)న దేశ వ్యాప్తంగా 2,06,985 మందికి టీకా అందించగా..25న ఒక్కరోజే 4,08,305 మందికి టీకా వేసినట్లు పేర్కొంది. గురువారం రాత్రి 7 గంటల వరకూ దేశంలో 28,47,608 మంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి టీకా అందిచినట్లు తెలిపింది.

టీకాలు వేసిన సంఖ్య పరంగా భారత్​ 5వ స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. కెేవలం ఆరు రోజుల్లోనే పది లక్షల మందికి టీకా అందించి.. ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 10 లక్షల మందికి టీకా వేయడానికి అమెరికాకు 10 రోజులు, స్పెయిన్​కు 12, ఇజ్రాయెల్​కు 14, యూకేకు 18, ఇటలీకి 19, జర్శనీకి 20 రోజులు పట్టినట్లు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 67 శాతం కరోనా యాక్టీవ్​ కేసులు కేరళ, మహారాష్ట్రలకే పరిమితమయ్యాయని.. మిగతా దేశం మొత్తం కలిసి 37 శాతం కేసులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. గత వారంలో పాజిటివిటీ రోటు 1.81 శాతానికి, మరణాల రేటు 1.07 శాతానికి తగ్గినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: కరోనా టీకా ప్రభావం ఎంతకాలం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.