ETV Bharat / city

బయటకెళ్లాలంటే భయం.. భవితపై బెంగ - corona in world latest

అగ్రరాజ్యాన్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. అక్కడ ఉండే భారతీయులు.. అందునా తెలుగువారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముఖ్యంగా కొత్తగా వెళ్లిన వారి పరిస్థితి మరీ దారుణం. వైరస్‌ విజృంభణ.. భవిష్యత్తుపై బెంగ.. ఎవరిని కదిపినా ఇదే వేదన. గత రెండు, మూడు దశాబ్దాలుగా అమెరికాలో వివిధ వృత్తుల్లో ఉంటున్న వారి ఆవేదన ఇలా.

covid effect in usa and telug NRIs
బయటకెళ్లాలంటే భయం.. భవితపై బెంగ
author img

By

Published : Mar 31, 2020, 8:03 AM IST

రోజురోజుకూ పెరుగుతున్న తీవ్రత

covid effect in usa and telug NRIs
డాక్టర్‌ గోగు సుధీర్‌రెడ్డి

'కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎక్కువ రాష్ట్రాలకు విస్తరిస్తోంది. అందరికీ పరీక్షలు చేయలేకపోతున్నారు. ఫిబ్రవరిలో ఆంక్షలు లేకపోవడం వైరస్‌ విజృంభణకు కారణమైంది. ఫిబ్రవరి 25న లౌసియానాలో పండుగ జరిగింది. ఆ సమయంలో ఎక్కువమంది వచ్చారు. అక్కడ అన్ని దేశాల వారూ ఉంటారు. ఫిబ్రవరిలో ఆంక్షలు పెట్టి ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదేమో. గత మూడు రోజుల్లో కరోనా తీవ్రత రెండు రెట్లు పెరిగింది. భారతీయుల్లో ఎక్కువ మంది నా దగ్గరికి వైద్యానికి దగ్గుతో బాధపడుతూ వస్తున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం ఇలాంటివి ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాల్సిందే. వైద్యం కోసం వచ్చే వారిని కారులోనే ఉండమని మాట్లాడటం లేదా టెలిమెడిసిన్‌ పద్ధతిలో వైద్యం చేస్తున్నాం. ఈ లక్షణాలున్న వారిలో 10 శాతం మందికి మాత్రమే పరీక్షలు చేయగలుగుతున్నారు. ఫ్లూ, ఇతర వైరస్‌లు గతంలో చాలా వచ్చాయి. దీనివల్ల మరణాలు ఎక్కువ శాతం ఉంటాయి. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం పత్రికల వల్ల వైరస్‌ సోకదు. ఇక్కడ పత్రికలు రోజూ వేస్తున్నారు. తీసుకొని చదువుతున్నాం.'

-డాక్టర్‌ గోగు సుధీర్‌రెడ్డి, శాన్‌ ఆంటోనియో టెక్సాస్‌

అంతా ఆందోళనకరం

covid effect in usa and telug NRIs
శైలజ ఏటూరు (గృహిణి)

ఇక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వచ్చే రెండు వారాల్లో వైరస్‌ వ్యాప్తి ఎలా ఉంటుందో, ఎందరిని బలిగొంటుందో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో, ఎందరు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో ఇవన్నీ ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. కొలువుకు వెళ్లాలంటే భయం వేసే పరిస్థితి. నా భర్త, కుమార్తె వైద్యులు. ప్రతిరోజు ఆసుపత్రి నుంచి వారు ఇంటికి వచ్చాక టెంపరేచర్‌, ఆక్సిజన్‌ స్థాయి పరీక్షించుకోవడం సర్వసాధారణమైంది. మేము మార్చి 15న హాలిడే నుంచి తిరిగి వచ్చాం. అప్పటికి పరిస్థితి మామూలుగానే ఉంది. తర్వాత కరోనా బాధితుల సంఖ్య ఎక్కువైంది. 400 శాతం వరకు పెరిగిందంటున్నారు. వెంటిలేటర్‌ మీదకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. భారతీయులు ప్రత్యేకించి తెలుగువారు వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం, రక్షణ చర్యల గురించి చర్చించుకోవడం ఎక్కువగా ఉంది. అమెజాన్‌లో కూరగాయలు తెప్పించుకొని కడిగి రెండు, మూడు రోజుల తర్వాత కానీ వాడుకోవడం లేదు. ఇళ్లు శుభ్రం చేసే వారిని కూడా పిలవడం లేదు.

- శైలజ ఏటూరు (గృహిణి), రోస్లిన్‌, న్యూయార్క్‌

కరోనా హాట్‌స్పాట్‌గా న్యూయార్క్‌

covid effect in usa and telug NRIs
సురేశ్‌ సొంగ

ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. న్యూయార్క్‌ కరోనా హాట్‌స్పాట్‌గా మారిపోయింది. ఇక్కడ 52 వేల కేసులు నమోదయ్యాయి. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. ఇక్కడ దగ్గరగా పెద్దపెద్ద భవనాలుంటాయి. 70 అంతస్తుల భవనాల్లో తలుపులు, లిప్టులు ఇలాంటివన్నీ వైరస్‌ వ్యాప్తికి కారణమైనవే. న్యూయార్కులో 90 శాతం మంది ప్రజారవాణాపై ఆధారపడతారు. సులభంగా ఎక్కువ మందికి వ్యాపించడానికి ఇది కూడా కారణమైంది. ఆర్థిక వ్యవస్థపైన, వ్యక్తిగతంగాను.. నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది. మెక్‌డోనాల్డ్స్‌, హెయిర్‌ కటింగ్‌ సెలూన్లు ఇలాంటివన్నీ మూతపడ్డాయి. ఒక షాపింగ్‌ మాల్‌లో 100 దుకాణాలుంటే అందులో నాలుగు మాత్రమే తెరిచి ఉన్నాయి. ఇవి కూడా నిత్యావసర షాపులే.. వ్యక్తిగతంగా నడిపే దుకాణాల్లో పనిచేసే 40 లక్షల మంది సామాజిక భద్రత పరిహారం కోసం దరఖాస్తు చేశారు. ఇదే పరిస్థితి రెండు, మూడు వారాలు మించి కొనసాగితే భారతీయులు, తెలుగువారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. యువ కుటుంబాలపై ఈ ప్రభావం తీవ్రం. నేను ఇక్కడికి వచ్చి రెండున్నర దశాబ్దాలైంది. నా పరిస్థితి వేరు. ఇక్కడికి ఐదు-పదేళ్లలోపు వచ్చిన వారి సంఖ్యే ఎక్కువ. హెచ్‌-1 వీసా, గ్రీన్‌కార్డుల జారీ నిలిచిపోయాయి. ఇక్కడ పనిచేసే వాళ్లలో సగం మంది కాంట్రాక్టు జాబ్‌లు చేస్తున్నారు. ఉద్యోగాల్లో కోత, లే ఆప్‌లు ఇవ్వన్నీ.. ఎప్పటిలోగా కరోనా అదుపులోకి వస్తుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఐటీ కంపెనీల నుంచి ఇన్‌వాయిస్‌ వెళ్తున్నా, పేమెంట్‌ రావడం లేదు. న్యూజెర్సీలో వారం క్రితం పది కేసులు ఉంటే ఇప్పుడు పది వేలయ్యాయి. న్యూజెర్సీలో నేను పనిచేసే కంపెనీలో 250 మంది ఉంటే అంతా వర్క్‌ ఫ్రం హోమే. హైదరాబాద్‌లో ఉన్న మా కంపెనీలో కూడా ఇంతే.

- సురేశ్‌ సొంగ, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌, ఐటీ ఎంఎన్‌సీ, న్యూజెర్సీ

ఎటు చూసినా నిర్మానుష్యమే

covid effect in usa and telug NRIs
సాగర్‌ దొడ్డపనేని

రెండున్నర దశాబ్దాలుగా అమెరికాలో ఉన్నా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లలో మనుషులు కనిపించడం లేదు. రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయి. ఇక్కడ భారతీయుల రెస్టారెంట్లే ఎక్కువ. తినడానికి ఎవ్వరూ రావడంలేదు. ఐటీ ఉద్యోగాలు అంతా ఇంట్లోంచే. ప్రస్తుతం సంక్షోభంలో ఇలా చేసినా, ఇది బాగానే ఉందంటే భవిష్యత్తులో కూడా దీనిని కంపెనీలు కొనసాగించవచ్చు. శాన్‌ఫ్రాన్సిస్కోలో చాలా మంది తెలుగువారున్నారు. మూడు నుంచి ఆర్నెల్లు ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఇక్కడికొచ్చిన విద్యార్థులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. విద్యార్థులకు ఇక్కడ అద్దె, ఇతరత్రా రుణాలు ఉంటాయి. గతంలో ఏదో ఒక పని చేసుకొంటూ కొంత పాకెట్‌మనీ సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది. ప్రస్తుతం ఇవ్వన్నీ ఆగిపోయాయి. కొత్తగా వచ్చిన వారికి గ్రీన్‌కార్డు రావడం చాలా ఇబ్బంది. హెచ్‌-1 కోసం ప్రయత్నించే వారికి ఇంకా సమస్య.

-సాగర్‌ దొడ్డపనేని, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా

ఇవీ చూడండి-అమెరికా కంటే భారత్‌లోనే కరోనా మరణాల రేటు ఎక్కువ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.