ETV Bharat / city

కొవిడ్​ వాక్సిన్​పై మీ డౌట్స్​ ఇవేనా..? - కరోనా వ్యాక్సిన్ వార్తలు

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ముందుగా వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి టీకా వేస్తున్నారు. అయితే సామాన్యుల్లో టీకాపై చాలా సందేహాలున్నాయి. టీకా వేసుకోవడం దగ్గరి నుంచి వేసుకున్నాక ఎలా ఉండాలి.. ఎవరెవరు టీకాలు తీసుకోవచ్చు.. వ్యాక్సిన్​ వేసుకున్నాకా మద్యం తాగవచ్చా... ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మీకోసం...

covid vaccine
కొవిడ్​ వాక్సిన్
author img

By

Published : Jan 19, 2021, 11:56 AM IST

  • మద్యంతో టీకా దెబ్బతింటుందా?

అతిగా మద్యం తాగితే టీకాతో పుట్టుకొచ్చే రోగనిరోధక ప్రతిస్పందనలు తగ్గిపోవచ్చు. అందుకే రష్యా ప్రభుత్వం టీకా తొలి మోతాదు తీసుకోవటానికి 2 రెండు వారాల ముందు నుంచే మద్యం మానెయ్యాలని సూచించింది. అలాగే రెండో మోతాదు తీసుకున్నాక 6 వారాల వరకూ దీని జోలికి వెళ్లొద్దని చెప్పింది.

  • ముందు కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలా?

అవసరం లేదు. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం వంటి కొవిడ్‌ అనుమానిత లక్షణాలుంటే మాత్రం పరీక్ష చేయించుకోవాలి. ఫలితం నెగెటివ్‌గా వచ్చినప్పటికీ లక్షణాలు తగ్గాకే టీకా తీసుకోవాలి.

  • కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు తీసుకోవచ్చా?

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ గలవారు, కొవిడ్‌ అనుమానిత లక్షణాలు గలవారు టీకా తీసుకోవటం వాయిదా వేసుకోవాలి. ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాక 4-8 వారాల తర్వాతే టీకా తీసుకోవాలి. కొవిడ్‌కు మోనోక్లోనల్‌ యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్నవారికి, ఇతరత్రా ఏవైనా జబ్బులు తీవ్రమై ఆసుపత్రిలో చేరినవారికీ ఇదే వర్తిస్తుంది.

  • ఎన్ని మోతాదులు తీసుకోవాలి?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను రెండు మోతాదుల్లో తీసుకోవాలి. ఒకటి తీసుకున్నాక 28 రోజులకు మరో మోతాదు తీసుకోవాలి. నిర్వీర్య వైరస్‌, బలహీన పరచిన వైరస్‌ భాగాలతో రూపొందించిన ఇవి సమర్థంగా పనిచేయాలంటే రెండు మోతాదులూ తీసుకోవాలి.

  • ఒక్కటే తీసుకుంటే ఏమవుతుంది?

ఒక మోతాదుతో 60-80% వరకు రక్షణ లభించొచ్చు. అదీ ఎక్కువ కాలం కొనసాగదు. అందువల్ల సంపూర్ణ రక్షణ లభించాలంటే రెండు మోతాదులు తప్పకుండా తీసుకోవాలి.

  • రెండోది తీసుకోవటం మరచిపోతే?

గాబరా పడాల్సిన పనిలేదు. వీలైనంత త్వరగా రెండో మోతాదు తీసుకోవాలి. మొదటి మోతాదు టీకాను మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదు.

  • మందులపై ప్రభావముంటుందా?

మందుల మీద టీకా విపరీత ప్రభావమేమీ ఉండదు. కాకపోతే రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు, స్టిరాయిడ్లు వాడుతున్నవారిలో యాంటీబాడీలు అంతగా ఉత్పత్తి కాకపోవచ్చు.

  • అవయవ మార్పిడి చేయించుకున్నవారు తీసుకోవచ్చా?

అవయవ మార్పిడి చేయించుకున్నవారు రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వాడుతుంటారు. కాబట్టి ప్రస్తుతానికి కరోనా టీకాను వీరికి సిఫారసు చేయటం లేదు. మున్ముందు అవసరమైతే నిపుణుల సలహా మేరకు, అదీ వైద్యుల పర్యవేక్షణలోనే ఇచ్చే అవకాశముంది.

  • వైరస్‌ మారినప్పుడల్లా మరో టీకా తీసుకోవాలా?

కరోనా వైరస్‌ అప్పుడప్పుడు జన్యుపరంగా మార్పులు చెందుతుండొచ్చు గానీ ఇది ఫ్లూ వైరస్‌ మాదిరిగా మారుతున్నట్టు ఇప్పటివరకూ బయటపడలేదు. పైగా ఇలాంటి విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే టీకాలను రూపొందించారు. కరోనా వైరస్‌ మారినా టీకాలు పనిచేస్తాయి. బ్రిటన్‌లో బయటపడ్డ కొత్తరకం వైరస్‌ మీదా టీకాలు పనిచేస్తున్నట్టు వెల్లడైంది.

  • గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవచ్చా?

టీకా తయారీ సంస్థలు గర్భిణులపై ఇంకా ప్రయోగ పరీక్షలు చేయలేదు. వీరిపై టీకా ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు కరోనా టీకా ఇవ్వద్దనే అమెరికా సీడీసీ చెబుతోంది. టీకా తీసుకున్నాక రెండు నెలల వరకు గర్భం ధరించొద్దని బ్రిటన్‌ ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలేవీ సజీవ వైరస్‌తో రూపొందించినవి కావు. కాబట్టి ఒకవేళ పొరపాటున తీసుకున్నా ఇబ్బంది ఉండకపోవచ్చు.

  • మధుమేహంతో బాధపడేవారు తీసుకోవచ్చా?

తీసుకోవచ్చు. నిజానికి మధుమేహం గలవారికి కరోనా వచ్చే అవకాశమే కాదు.. జబ్బు తీవ్రమయ్యే ముప్పు కూడా ఎక్కువే. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు తొలిదశలోనే టీకా తీసుకోవటం ఉత్తమం.

  • అన్ని టీకాల మోతాదులు సమానమేనా?

చాలావరకు సమానమే. అయితే వేర్వేరు వాహక వైరస్‌లతో రూపొందించిన స్పుత్నిక్‌-వి టీకా మోతాదులు వేరుగా ఉంటాయి. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రోజెనికా టీకాను మున్ముందు తొలిసారి సగం మోతాదులోనే ఇవ్వచ్చు.

  • పిల్లలకూ టీకా ఇప్పించాలా?

కరోనా టీకా ప్రయోగ పరీక్షలు 18 ఏళ్లు పైబడినవారికే నిర్వహించారు. అందువల్ల ప్రస్తుతానికి 18 ఏళ్లలోపు వారికి టీకాలు ఇవ్వకూడదనే నిర్ణయించారు. ఇటీవలే 12 ఏళ్లలోపు పిల్లలపై ప్రయోగ పరీక్షలు ఆరంభమయ్యాయి. వీటి ఫలితాలు వెలువడిన తర్వాతే పిల్లలకు, శిశువులకు టీకా అవసరమా? ఇస్తే ఎంత మోతాదులో ఇవ్వాలి? అనేది తేలుతుంది.

  • ఏ రకం టీకా తీసుకోవాలి?

అన్ని టీకాలు దాదాపు ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న టీకా ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మనదేశంలో తయారైన టీకాలు మరింత అనువైనవని చెప్పుకోవచ్చు. వీటిని 2-8 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలో భద్రపరిస్తే సరిపోతుంది. పైగా చవక. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలనైతే అతి శీతలమైన.. -20, -70 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది మనదేశంలో కష్టం. ప్రస్తుతానికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు మనకు అందుబాటులోకి రాలేదు. మున్ముందు రావొచ్చు.

  • టీకా తీసుకున్నాక ఎన్నిరోజులకు రక్షణ లభిస్తుంది?

సాధారణంగా రెండో మోతాదు టీకా తీసుకున్న 2 వారాల తర్వాత అత్యుత్తమ రక్షణ మొదలవుతుంది. జబ్బు తీవ్రం కావటం 70-90% వరకు తగ్గుతుంది. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం నూటికి నూరు శాతం తగ్గుతుంది. టీకా తక్షణ లక్ష్యం కూడా ఆసుపత్రిలో చేరటాన్ని, మరణాలను నివారించటమే.

ఇదీ చదవండి: టీకా వికటించి ఎవరూ చనిపోలేదు: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.