ETV Bharat / city

భాగ్యనగరంలో చప్పుడు చేయకుండా చుట్టుముడుతోంది!

భాగ్యనగర వ్యాప్తంగా కొవిడ్​ వైరస్​ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జియాగూడలో వందకు పైగా, మంగళ్​హాట్​ పరిధిలో యాభైకు పైగా కేసులు నమోదవడం నగరవాసుల్ని కలవరపెడుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదివారం 23 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు.

hyderabad
భాగ్యనగరంలో చప్పుడు చేయకుండా చుట్టుముడుతోంది!
author img

By

Published : May 25, 2020, 5:11 PM IST

హైదరాబాద్​ నగరంలో కరోనా మహమ్మారి చప్పుడు చేయకుండా చుట్టుముడుతోంది. జియాగూడ పరిధిలో వందకు పైగా, మంగళ్‌హాట్‌ పరిధిలో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడం నగరవాసుల్ని కలవర పెడుతోంది. ఆ రెండు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలకు కుటుంబాలే కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. జియాగూడ కేంద్రంగా పలు ప్రాంతాలకు వైరస్‌ పాకినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌లో నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు వచ్చిన కిరాణా దుకాణాల వ్యాపారులు అధిక శాతం వైరస్‌ బారిన పడుతున్నట్లు తెలిసింది. మంగళ్‌హాట్‌లో కొత్తగా మరో ముగ్గురిని పాజిటివ్‌లుగా నిర్ధరించారు. దీంతో ఆ ప్రాంతంలో బాధితుల సంఖ్య 59కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదివారం 23 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు.

కార్వాన్‌లో ఒకే ఇంట ఆరుగురికి

కార్వాన్‌ పరిధిలో ఉంటూ హోల్‌సేల్‌ దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి కొవిడ్‌-19 సోకగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కుటుంబంలోని 8 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించగా తాజాగా మరో ఐదుగురు పాజిటివ్‌గా తేలారు.

ముగ్గురు చిరు వ్యాపారులకు..

భోలక్‌పూర్‌ డివిజన్‌కు చెందిన ఓ వ్యక్తి(45) వ్యాపారం నిమిత్తం పురానాపుల్‌కు వెళ్లగా జ్వరం వచ్చింది. పరీక్షలు నిర్వహించి కరోనా వచ్చిందని గుర్తించారు. ఈ డివిజన్‌లో 8 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో ముగ్గురు చిరువ్యాపారులే.

అక్కకు సపర్యలు చేసేందుకు వెళ్లిన చెల్లికి

మంగళ్‌హాట్‌ ఠాణా పరిధిలో తాజాగా మరో 3 కేసులు నమోదయ్యాయి. క్కెరవాడీకి చెందిన మహిళ(58), ఆమె కొడుకు(26) వైరస్‌ బారినపడ్డారు. మరో ప్రాంతంలో, కరోనా సోకిన అక్కకు సపర్యలు చేసేందుకు వెళ్లిన మహిళకు కరోనా సోకింది. అక్క మరణించగా.. ఇంటికి చేరిన ఆమెకు పాజిటివ్‌ రావడం వల్ల కుటుంబంలోని 17 మందిని క్వారంటైన్‌లో ఉంచారు.

కుమారుడి ద్వారా తల్లికి..

బోరబండలోని బంజారానగర్‌కు చెందిన మాంసం దుకాణ నిర్వాహకుడి(27) నుంచి అతని తల్లికి వైరస్‌ సోకింది. వనస్థలిపురం ఎన్జీవోస్‌ కాలనీలోని మీసేవా కేంద్రం సమీపంలో ఓ వృద్ధురాలు కరోనా బారిన పడగా తాజాగా తనయుడికీ సోకింది.

వైద్య పరీక్షలకు వచ్చి..

వైద్య పరీక్షల నిమిత్తం మియాపూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన దంపతులు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరూ వైరస్‌ బారిన పడ్డారు.

కరోనా బారిన కాపలాదారుడు

ఎర్రగడ్డ డివిజన్‌లో ప్రైవేటు వసతిగృహంలో కాపలాదారుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని, ఇదే డివిజన్‌లో మరో గృహిణిని పాజిటివ్‌లుగా నిర్ధారించారు. రెండు కుటుంబాల్లో 11 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.

అంత్యక్రియలకు వెళితే..

మణికొండ పరిధిలో ఉండే ఓ ప్రైవేటు ఉద్యోగి(31) ఈనెల 10న విజయవాడలో బంధువు అంత్యక్రియలకు వెళ్లి 20వ తేదీ తిరిగొచ్చాడు. అనారోగ్యంతో 21వ తేదీన ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలున్నాయని గాంధీ ఆస్పత్రికి పంపారు. పాజిటివ్‌గా నిర్ధారించారు.

లక్షణాలతో ఆసుపత్రులకు

నల్లకుంట ఫీవరాసుపత్రిలో ఏడుగురిలో కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు. వీరిలో నాగోల్‌ వాసి ఒకరు, అంబర్‌పేటకు చెందిన ఆరుగురున్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో అయిదుగురికి పాజిటివ్‌ రాగా ‘గాంధీ’కి తరలించారు. తాజాగా 45 మంది ఇక్కడ చేరారు. 16 మందికి నెగిటివ్‌ రావడంతో ఇళ్లకు పంపారు.

ఇది చదవండి తెలంగాణ: వరంగల్‌ గొర్రెకుంట ఘటనలో కొత్త కోణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.