ETV Bharat / city

మరోసారి 10 వేలకు పైనే కేసులు... 5,37,687కి చేరిన బాధితులు - corona cases in ap

రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడంలేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,175 కరోనా కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,412 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు.

corona latest update from Andhra Pradesh
తగ్గని కరోనా ఉద్ధృతి... 5,37,687కి చేరిన బాధితులు
author img

By

Published : Sep 10, 2020, 6:12 PM IST

రాష్ట్రంలో కొత్తగా 10,175 కరోనా కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 5,37,687కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,702 మంది మృతిచెందారు. ప్రస్తుతం 97,338 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి 10,040 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,35,647కి చేరింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 72,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 43,80,991 కరోనా పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మృతులు...

కరోనాతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతిచెందారు. కృష్ణాలో 7, ప్రకాశంలో 7, అనంతపురంలో ఆరుగురు మరణించారు. కరోనాతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు విడిచారు. గుంటూరులో ఇద్దరు, విజయనగరంలో ఒకరు మృతి చెందారు.

జిల్లాల్లో కేసులు...

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,412 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 1,386, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,139, చిత్తూరులో 968, గుంటూరులో 838, నెల్లూరులో 823, శ్రీకాకుళంలో 664, కడపలో 576, కృష్ణాలో 545, విజయనగరంలో 516, కర్నూలు జిల్లాలో 482, అనంతపురంలో 422, విశాఖ జిల్లాలో 404 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.