ETV Bharat / city

కరోనా ప్రభావం... ఫొటోగ్రాఫర్ల బతుకు దుర్భరం - hyderabad latest news

కంటికి కనిపించని కరోనా వైరస్... కాలసర్పమై 'మూడో కన్ను'ను కాటేసింది. ఇన్నాళ్లూ పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, వేడుకల్లో క్లిక్... క్లిక్... మన్న కెమెరాలు వైరస్ ధాటికి ఒక్కసారిగా నిశ్శబ్ధం పాటిస్తున్నాయి. ఫలితంగా కెమెరానే నమ్ముకొని జీవిస్తున్న ఎన్నో కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకరంగా మారింది. అప్పుల్లో కూరుకుపోక ముందే ప్రభుత్వం తమపై దృష్టిసారించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

corona-effect-on-photographars-in-hyderabad

author img

By

Published : Apr 29, 2020, 2:10 PM IST

కరోనా ప్రభావం... ఫొటోగ్రాఫర్ల బతుకు దుర్భరం

ప్రపంచమంతా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంటే... ఆ యుద్ధాన్ని, వైరస్ తీవ్రతను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న సాధనం కెమెరా. కానీ... ఆ కెమెరాను కూడా కరోనా వైరస్ కాలసర్పమై మింగేస్తోంది. ఫొటోగ్రఫీ రంగంపై ఆధారపడిన కుటుంబాలను అప్పుల్లో కూరుకుపోయేలా చేస్తోంది. కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ ఈ రంగంపై పెనుప్రభావం చూపుతోంది.

స్టూడియోలు మూసివేత

వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే సమూహాలుగా ఉండవద్దని, పెళ్లిళ్లు, వేడుకలను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయి. ప్రజలంతా ప్రాణభయంతో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది నిరాడంబరంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లల్లోనే శుభకార్యాలు చేసుకుంటున్నారు. ఫలితంగా ఫంక్షన్ హాల్స్ మూతపడ్డాయి. దీనివల్ల ఫొటోగ్రాఫర్లకు పనిలేకుండా పోయింది. ఈ కారణంగా వారికి వచ్చే ఆదాయాన్ని నష్టపోతున్నారు.

సుమారు వెయ్యి కోట్ల వ్యాపారం

ఏటా రెండు రాష్ట్రాల్లో కలిపి ఫొటోగ్రఫీ రంగంలో 800 నుంచి వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో ప్రభుత్వాలకు పన్నుల రూపంలో సుమారు 200 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. వైరస్ ప్రభావంతో 2020లో మొత్తం 20 శాతం కూడా వ్యాపారం కాకపోవచ్చని ఫొటోగ్రాఫర్లు వాపోతున్నారు. ప్రభుత్వాలు ఫొటోగ్రఫీ రంగాన్ని ప్రత్యేకంగా గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

దేశంలో 24 గంటల్లో 73 మంది కరోనాతో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.