రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 64,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,520 కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ మహమ్మారి బారినపడి మరో 10 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 13,887కి చేరింది. తాజాగా కరోనా నుంచి 1,290 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20లక్షల 18వేల 200 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,922 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 68 లక్షల 9 వేల 744 నమూనాలను ఆరోగ్యశాఖ పరీక్షించింది. కరోనాతో కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు నెల్లూరులో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా.. తూర్పుగోదావరి జిల్లాలో 263, చిత్తూరు జిల్లాలో 188, నెల్లూరు జిల్లాలో 186, పశ్చిమగోదావరి జిల్లాలో 171 కరోనా కేసులు నమోదైనట్లు తాజా హెల్త్ బులిటెన్లో పేర్కొంది.
ఇదీ చదవండి: