ETV Bharat / city

కరోనా రికవరీ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది 3వ స్థానం!

రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకీ బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇదిలా ఉంటే కోలుకునే వారి సంఖ్య తగ్గుతోందని స్వయంగా రాష్ట్ర కొవిడ్ కేంద్రం ప్రత్యేక అధికారులే చెప్తున్నారు. కేసుల రికవరీ రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది.

corona-cases
corona-cases
author img

By

Published : Jul 16, 2020, 12:01 AM IST

రాష్ట్రంలోని కరోనా బాధితుల్లో కోలుకునే వారి శాతం తగ్గుతోందని రాష్ట్ర కొవిడ్ కేంద్రం ప్రత్యేక అధికారి డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు. కోలుకునేవారు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఏపీది 3వ స్థానం కావడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బుధవారానికి రికవరీ రేటు 63.24 శాతంగా నమోదైందని స్పష్టం చేశారు. కర్ణాటక 38.45 శాతం, కేరళ 49.69 శాతం తర్వాత 51.84 శాతంతో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. తెలంగాణలో ఇది 65.81 శాతంగా ఉందని వెల్లడించారు.

గతంలో ఏపీలో నమోదైన 2866 కేసుల్లో కోలుకున్న వారు 65.28 శాతం ఉందని.. అప్పుడు రికవరీ రేటు బాగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది 4వ స్థానంలో ఉందన్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కేసులు ఉధృతి ఎక్కువ అయ్యిందని వెల్లడించారు. తొలి 10 వేలు నమోదయ్యేందుకు 105 రోజులు పట్టగా.. ఆ తర్వాత వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగిందన్నారు. ప్రజల రాకపోకలు, ప్రయాణాలు పెరిగిన క్రమంలో కొన్ని రోజుల వ్యవధిలోనే.. కేసులు విపరీతంగా నమోదవుతున్నాయని రాష్ట్ర కొవిడ్ కేంద్రం ప్రత్యేక అధికారి తెలిపారు. దీని ప్రభావం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యే వారిపైనా.. కనిపిస్తోందన్నారు.

జాతీయ స్థాయిలో మరణాల రేటు 2.60 శాతం కాగా.. మన రాష్ట్రంలో ఇది 1.27గా రికార్డు అయింది. 4.73 శాతంతో గుజరాత్ ప్రధమ స్థానంలో నిలిచింది. దిల్లీలో 2.93 శాతం, కర్ణాటకలో 1.22 శాతం, తెలంగాణాలో 0.89 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లక్షణాలు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయా రోగులు కోలుకునేందుకు 10రోజుల నుంచి 2,3 వారాలు వరకు పడుతోంది. ఈ కారణంగా రికవరీ రేటు తగ్గుతోందని డాక్టర్ రాంప్రసాద్ రాష్ట్ర కొవిడ్ కేంద్రం ప్రత్యేక అధికారి, వైద్య విద్య అదనపు సంచాలకులు తెలిపారు.

ఇదీ చదవండి:

'యజమాని హక్కులకు భంగం కలగకుండా కొత్త కౌలుదారు చట్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.