రాష్ట్రంలో కొత్తగా 1,502 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్‌తో మృతి చెందారు. 1,525 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,883 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల్లో 63,717మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో నలుగురు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో 260, చిత్తూరు జిల్లాలో 208 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 191, ప్రకాశం జిల్లాలో 152 కరోనా కేసులు బయటపడ్డాయి.
ఇదీ చదవండి: corona cases: చిట్టేడు గురుకులంలో కొవిడ్ కలకలం..